బన్నీకి అచ్చి వచ్చిన జోనర్ లో

వైవిధ్యమైన సినిమాలు చేయడం హీరో బన్నీకి ఇష్టమే కానీ, అతని ఫ్యాన్స్ మాత్రం స్టయిలిష్ లుక్ లో చూడాలనే అనుకుంటారు. నా పేరు సూర్య సినిమాలో డిఫరెంట్ గెటప్ ట్రయ్ చేసి ఫెయిల్ అయ్యాడు. అంతకు ముందు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు త్రివిక్రమ్ తో చేసినపుడు ఈ స్టయిలిష్ అండ్ క్యాజువల్ లుక్ ను వదల్లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇదే కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో.

ఈ సినిమా నుంచి రెండు పాటలు ఇప్పటికి బయటకు వచ్చాయి. తొలిపాటలో బన్నీ జస్ట్ క్యాజువల్ లుక్ లో కనిపించాడు. రెండో పాటలో స్టయిలిష్ లుక్ లో కనిపించాడు. తొలిపాట కేవలం సాంగ్ గా మాత్రమే వైరల్ అయిపోయింది. ఇప్పుడు విడుదల చేసిన రెండోపాట విజువల్ గా కూడా వైరల్ అయ్యేలా కనిపిస్తోంది.

బన్నీ ఫ్యాన్స్ కు ఇష్టమైన స్టయిలిష్ లుక్, డ్యాన్స్ రెండూ ఈ సాంగ్ లో కనిపిస్తున్నాయి. పాట కూడా పక్కా క్యాచీ నెంబర్ అని క్లియర్ గా తెలుస్తూనే వుంది. వాస్తవానికి పాట పూర్తిగా విడుదల చేయకుండానే, కేవలం సాంగ్ టీజర్ తోనే మాంచి ఇంపాక్ట్ రాబట్టగలిగారు.

మొత్తంమీద రెండుపాటలతో అల వైకుంఠపురం సినిమా పండగ సినిమాల్లో ఇప్పటికి ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న సినిమాగా మిగిలింది.

Show comments

Related Stories :