బ్రేకింగ్-నోటా డేట్ పై కిందా మీదా

యువ సంచలనం విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా 'నోటా' ఈ సినిమా విడుదలను అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ప్రకటించారు. దీంతో అప్పుడు షెడ్యూలు అయిన రవితేజ అమర్ అక్బర్ ఆంథోని సినిమా వెనక్కు వెళ్లే పరిస్థితి వచ్చింది. కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, నోటా సినిమానే ఇప్పుడు వెనక్కు వెళ్తోంది.

అక్టోబర్ ఫస్ట్ వీక్లో నోటా విడుదల చేస్తే, తరువాత వారం వచ్చే త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా కోసం థియేటర్లలోంచి లేపేస్తారని, అలాగే నోటా రిజల్ట్ తేడా వస్తే, మరీ సమస్య అవుతుందని నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా భావిస్తున్నారు. అందుకే అక్టోబర్ 18న విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు బోగట్టా.

18కి వస్తే ఎక్కువ థియేటర్లు దొరకవు, ఫస్ట్ వీక్ నే బెటర్ అని చెప్పినా తక్కువ థియేటర్లు అయినా 18కే వస్తానని జ్ఞాన్ వేల్ రాజా అంటున్నారు. కానీ అదే సమయంలో తమిళంలో 18న విశాల్, థనుష్ సినిమాలు వున్నాయి. అందువల్ల ఫస్ట్ వీక్ నే బెటర్ అనే సూచనలే వినిపిస్తున్నాయి.

కానీ ఇప్పుడు దిల్ రాజు కిందా మీదా అవుతున్నారు. ఆయన సినిమా 'హలో గురూప్రేమ కోసమే' కు నోటాతో సమస్య వస్తుందని ఆయన కిందా మీదా అవుతున్నారు. అసలు పందెం కోడి సినిమా పోటీగా వస్తుంది అనుకుంటే, ఇప్పుడు మరో సినిమా కూడా రావడం అంటే కాస్త కష్టమే. కానీ ఇటు పందెం కోడి, హలోగురూ ప్రేమకోసమే సినిమాలతో కలిసి రావడం అంటే నోటా కు కూడా కష్టమే.