బోయపాటికి ఆసరా.. ముందుకొచ్చిన గీతా

బాలయ్యతో సినిమా లైన్లో ఉందన్నాడు. మహేష్ మూవీ కోసం చర్చలు జరుగుతున్నాయన్నాడు. అఖిల్ తో కూడా ఓ సినిమా కమిట్ మెంట్ ఉందని ప్రకటించాడు. ఇక చిరంజీవి సంగతి సరేసరి. మెగాస్టార్ ఎప్పుడంటే అప్పుడు రెడీ అని చెప్పుకొచ్చాడు. ఇలా చేతినిండా సినిమాలు పెట్టుకున్న బోయపాటి ఖాళీగా ఉండడమేంటి?

దీనికి కారణం వినయ విధేయరామ. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో బోయపాటి ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు. దీనికితోడు సినిమా డిజాస్టర్ అయిన తర్వాత రామ్ చరణ్ రిలీజ్ చేసిన లెటర్, బోయపాటి పరువు తీసింది. ఆ దెబ్బతో ఇతడితో సినిమా చేయడానికి అంతా వెనక్కితగ్గారు. చివరికి కళ్లుమూసుకొని కథలు ఒప్పుకునే బాలయ్య కూడా బోయపాటిని దూరంపెట్టాడు.

అలా 6 నెలలుగా ఖాళీగా ఉన్న బోయపాటికి ఎట్టకేలకు ఓ భరోసా దక్కింది. త్వరలోనే తన బ్యానర్ పై బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించాడు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సరైనోడు సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు గీతాఆర్ట్స్ బ్యానర్ పై సినిమా చేయబోతున్నాడు బోయపాటి. గుణ369 ట్రయిలర్ రిలీజ్ కార్యక్రమంలో అల్లు అరవింద్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు.

అంతా బాగానే ఉంది కానీ బోయపాటి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై నటించే హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే కార్యక్రమంలో హీరో కార్తికేయను ఉద్దేశిస్తూ.. "వెల్ కమ్ టు గీతాఆర్ట్స్" అని అల్లు అరవింద్ చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ కాంబినేషన్ పై ఓ క్లారిటీ రానుంది.

గుణ369 ట్రయిలర్ రిలీజ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

మళ్ళీ ఆత్మగౌరవం నినాదం.. మారానని ప్రచారం

Advertising
Advertising