బాలకృష్ణ సినిమాలు ఫిక్స్

ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం, ఎన్నికల ఫలితం అన్నీ కలిసి హీరో బాలకృష్ణ సినిమాలకు కాస్త లాంగ్ బ్రేక్ వేసాయి. ఆఖరికి ఇప్పుడు అన్నీ సర్దుకుని మళ్లీ లైనప్ స్టార్ట్ అయింది. వచ్చేనెల మొదటివారం నుంచి కేఎస్ రవికుమార్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇది నేరుగా విదేశాల్లోనే షూట్ స్టార్ట్ చేసుకుంటుంది. అక్కడే ఓ పెద్ద షెడ్యూలు ఫినిష్ చేసుకుంటుంది. సి కళ్యాణ్ నిర్మించే ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

డిసెంబర్ నుంచి బోయపాటి సినిమా మీదకు రావాలని బాలయ్య డిసైడ్ అయ్యారు. ఈ మేరకు బోయపాటికి చెప్పేసారు కూడా. తాను కేఎస్ రవికుమార్ తరువాత బాగా సన్నబడి, మేకోవర్ తో మీ సినిమా చేస్తానని, అన్నీ రెడీ చేసుకోమని బోయపాటికి చెప్పినట్లు తెలుస్తోంది.

మొత్తంమీద ప్రస్తుతానికి రెండు సినిమాలు ఫిక్స్ అయ్యాయి. ఇదికాక పింక్ రీమేక్ ను బోనీకపూర్-దిల్ రాజు నిర్మాణంలో చేసే వ్యవహారం చర్చల దశలో వుంది. వార్తలు వినిపిస్తున్నట్లుగా పూరి-బాలయ్య సినిమా మాత్రం ఇంకా డిస్కషన్లలో కూడా లేదు.

వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ..?

Show comments