ఆత్మవంచనలో బాబును మించిపోయిన పవన్!

రాజకీయం అంటేనే ఆత్మవంచన. మనసులో ఉన్న సత్యాన్ని బయటపడనివ్వకుండా... అవసరార్థం ఏది పడితే అది మాట్లాడడమే రాజకీయం. తమ లోపాలు తమకు తెలిసినా, వాటిని దాచేసుకుంటూ ఎదుటివారి మీద నిందలు వేయడమే రాజకీయం. ఆ విద్యలో చంద్రబాబు ఘనాపాటి. అందుకే... ప్రజావ్యతిరేకత వెల్లువెత్తి ఓడిపోతున్నట్లు అర్థంకాగానే.. ఆయన తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ... ఈవీఎంల మీద దాడి చేశాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా.. ఎన్నికలు పద్ధతిగా జరగలేదంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు.

తమ అసమర్థతను ప్రజలు గుర్తించకుండా ఉండడానికి ఇలాంటి ఆత్మవంచన మాటలు వల్లెవేయడంలో పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబును మించిపోతున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు... పోలింగ్ ముగిసిన నాటినుంచి... చంద్రబాబు ఎన్నెన్ని మాటలు మాట్లాడినప్పటికీ... ఫలితాలు వెలువడిన తర్వాత... సైలెంట్ అయిపోయారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన ఆమోదించారు.

అదే పవన్ కల్యాణ్ భిన్నంగా మాట్లాడుతున్నారు. ఫలితాల నాటినుంచి మొన్నటికి విజయవాడ వచ్చేదాకా... షెల్ లో ఉండిపోయి కనీసం పార్టీ కార్యాలయానికి కూడా రాకుండా ముసుగు వేసుకు కూర్చున్న పవన్ కల్యాణ్... ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని అంటున్నారు. అంటే ఆయనకు అనుకూల ఫలితాలు రాకపోయినంత మాత్రాన, ఎన్నికలే పద్ధతిగా జరగలేదని వ్యాఖ్యానించే సాహసం... చివరికి చంద్రబాబు కూడా చేయలేదు. ఆ రకంగా చూస్తే.. ఆత్మవంచనలో బాబే బెటర్ అనిపిస్తోంది.

నాయకులు కాదలచుకునే వారు ముందుగా తమ లోపాలను తెలుసుకోగలగాలి. ఆ లోపాల విషయంలో పూర్తి క్లారిటీతో ఉంటూ, వాటిని దిద్దుకుంటూ ప్రజల మనసులు గెలుచుకోవడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా.. తమ లోపాలను అంగీకరించలేకుండా వైఫల్యాలకు ఇతరుల మీద, వ్యవస్థ మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తే మాత్రం... సాంతం నష్టం వారికే జరుగుతుంది.

ఈ రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి?

Show comments