అంతా జంక్.. టీడీపీలో మిగిలేది పేపర్ పులులేనా!

ఒక్కరిలో టైమింగ్ లేదు, ఎవరిలో పెర్ఫెక్షన్ లేదు, అంతా జంక్.. రీసెంట్ గా వచ్చిన ఓ సినిమాలో రామ్ చరణ్ డైలాగ్ ఇది. ఇప్పుడీ డైలాగ్ ను తెలుగుదేశం పార్టీకి యాజ్ ఇటీజ్ గా వాడేయొచ్చు. అవును.. కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అవకాశం రాని వాళ్లు, పెద్దగా ఉపయోగం లేని బ్యాచ్ మాత్రం టీడీపీలో ఉండిపోతోంది. అంటే పొలిటికల్ జంక్ అన్నమాట.

టీడీపీ టు వైసీపీ వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు బాబుకి షాకిచ్చి జగన్ పార్టీలో చేరిపోయారు. ప్రకాశం, కృష్ణాజిల్లాల్లోని నియోజకవర్గాల్లో కీలకనేతలు కూడా జగన్ తో జట్టుకట్టారు. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగిపోలేదు. మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బేషరతుగా జగన్ పక్కన చేరడానికి రెడీగా ఉన్నారు. ఇంచుమించుగా 30మందికి పైగానే టీడీపీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకోడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం.

వీళ్లు కాకుండా ఇంకో బ్యాచ్ చంద్రన్న పంచనే మిగిలిపోయింది. మా ఆశ, శ్వాస చంద్రబాబేనంటూ వీరంతా డాంబికాలు పలుకుతున్నారు. గంటా శ్రీనివాసరావు ఈ బ్యాచ్ లీడర్. పార్టీ మార్పు గురించి ఎవరూ ప్రశ్నించకపోయినా ఉలుకెక్కువై తాను చివరివరకూ టీడీపీలోనే ఉంటానని ప్రగల్భాలు పలుకుతున్నారు గంటా. కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి అయినా, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అయినా ఇవే చిలక పలుకులు పలుకుతున్నారు.

అసలు విషయం ఏంటంటే చంద్రబాబు పట్ల స్వామి భక్తి చూపిస్తున్న ఈ వినయ విధేయ రాములందరూ వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ ప్రభంజనంలో కొట్టుకుపోక తప్పదనే సమాచారం వీరికి కూడా ఉంది. పార్టీ మారాలనే ఆలోచన ఉన్నప్పటికీ వైసీపీ నుంచి వీరికి ఎప్పుడూ రెడ్ సిగ్నలే వస్తోంది. ఇలా గట్టివాళ్లంతా టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చేస్తుంటే.. వట్టివాళ్లు మాత్రం చంద్రబాబుతోటే మిగిలిపోతున్నారు. అంటే టీడీపీలో కేవలం జంక్ మాత్రమే మిగిలుతోందన్నమాట.

బాబుతోనే ఉంటాం, బాబే మా నాయకుడు అని చెబుతున్నవాళ్లంతా పేపర్ పులులే అని అంటున్నారు విశ్లేషకులు. మునిగే నావలో వీళ్లు ఉన్నా లేకున్నా ఒక్కటే అనేది వీళ్ల విశ్లేషణ. మరోవైపు ఇలాంటి బ్యాచ్ ని పక్కనపెట్టుకుని ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నారు చంద్రబాబు. కళ్లముందే తన బలం, బలగం మొత్తం వీడి వెళ్లిపోతుంటే... పక్కనే ఉన్న ఈ భక్తాగ్రేసరుల భజనలో బాబు మైమరచిపోతున్నారు. 

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?