ఆంటీతో కుర్రాడి పెళ్లికి బాబాయ్ ఓకే!

మలైకా ఆరోరాతో అర్జున్ కపూర్ పెళ్లికి.. అనిల్ కపూర్ ఓకే చెప్పినట్టుగానే స్పందించాడు. ఒక టాక్ షోలో ఈ అంశం ప్రస్తావనకు రాగా అనిల్ కపూర్ స్పందిస్తూ.. అర్జున్ కు పూర్తిగా సపోర్ట్ చేశాడు. తమ కుటుంబంలో ఎవరి అభిప్రాయాలకు అయినా మిగతా వాళ్లమంతా విలువని ఇస్తామని అనిల్ అన్నాడు. అర్జున్ కపూర్ తీసుకునే నిర్ణయానికి కూడా మద్దతు ఉంటుందని ప్రకటించాడు.

అర్జున్ గురించి తనకు బాగా తెలుసు అని అతడు తీసుకునే నిర్ణయాన్ని తను సపోర్ట్ చేస్తానని అనిల్ కపూర్ అన్నాడు. అతడు హ్యాపీగా ఉండటాన్నే తాము కోరుకుంటామని, అతడు హ్యాపీగా ఉండేందుకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాన్ని తాము ఎలా వ్యతిరేకిస్తామని అనిల్ ఎదురు ప్రశ్నించాడు.

ఇక జాన్వీకపూర్, ఇషాన్ ఖట్టర్ ల గురించి అభిప్రాయాన్ని చెప్పమనగా.. వారిద్దరూ మరికొన్ని సినిమాలు కలిసి చేయాలని అనిల్ కపూర్ ఆకాక్షించాడు. అంతకు మించి ఏం మాట్లాడలేదు. అదే రణ్ బీర్ కపూర్, అలియా భట్ ల గురించి స్పందించమనగా.. ప్రేమలో ఉన్న వాళ్లిద్దరూ వీలైనంత సమయాన్ని కలిసి గడపాలని అనిల్ కపూర్ అన్నాడు!

ఇక మలైకా, అర్జున్ లు జాయింట్ గా ముంబైలో ఒక ఫ్లాట్ ను కూడా కొనుగోలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే సోషల్ మీడియాలో తన అకౌంట్స్ లో పేరును కూడా మార్చుకుంది మలైకా. ఇదివరకూ ఈమె మలైకా ఆరోరా ఖాన్ గా పేరు పెట్టుకుంది. ఇప్పుడు పేరు నుంచి ఖాన్ ను తొలగించింది. ఇక కపూర్ ను యాడ్ చేసుకోవడమే మిగిలినట్టుగా ఉంది!

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments