స్టార్ క్రికెటర్ బయోపిక్ లో అక్కినేని అఖిల్?

సినిమా హీరోగా మారడాని కంటే ముందు అఖిల్ మంచి క్రికెటర్ అనే విషయం తెలిసిందే. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలనుకున్నాడు. దాని కోసం విదేశాల్లో ట్రయినింగ్ కూడా తీసుకున్నాడు. అయితే అంతలోనే క్రికెట్ వదిలేసి, సినిమాల్లోకి వచ్చేశాడు.

అఖిల్ సినిమాల్లోకి వచ్చినప్పటికీ మనసులో క్రికెట్ అలానే ఉంది. అందుకే తన కోరికను మరో రూపంలో తీర్చుకోవాలనుకుంటున్నాడు. క్రికెట్ నేపథ్యంలో సినిమా ఆఫర్ వస్తే నటిస్తానని ప్రకటించాడు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లి బయోపిక్ ఎవరైనా తీస్తే అందులో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని
ప్రకటించాడు.

"విరాట్ కోహ్లిది ఓ నిండైన జీవితం. ఎంతో లైప్ ఉంది. అతడి జీవితంలో కసి, కోరిక రెండూ ఉన్నాయి. అలాంటి క్రికెటర్ బయోపిక్ వస్తే చాలా బాగుంటుంది." అఖిల్ అన్నట్టు కోహ్లి జీవితంలో ఇవి మాత్రమే కాదు, బాలీవుడ్ హీరోయిన్ తో రొమాన్స్, డేటింగ్, మ్యారేజ్ కూడా ఉన్నాయి.

కాబట్టి బయోపిక్ గా తీయడానికి కావాల్సిన ముడిసరుకు మొత్తం కోహ్లి జీవితంలో ఉంది. ఎటొచ్చి ఆ బయోపిక్ ను అఖిల్ తోనే ఎందుకు తీయాలనేది ప్రశ్న. ఎందుకంటే కోహ్లి బయోపిక్ అంటే అది పాన్-వరల్డ్ సబ్జెక్ట్ అవుతుంది. అలాంటి సినిమాను అఖిల్ తో తీయాలని ఏ మేకర్ అనుకోడు.

Show comments