అఖిల్‌, బెల్లంకొండ బాగా తగ్గారు

మార్కెట్‌కి అనుగుణంగా సినిమాలు చేయడం సినీ వ్యాపారుల లక్షణం. కానీ మార్కెట్‌ కోసం సినిమాలు చేసి ఖంగుతిన్నారు అఖిల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌. పెద్ద దర్శకులతో, భారీ సెటప్‌తో సినిమాలు చేస్తే ఆటోమేటిగ్గా స్టార్‌ అయిపోవచ్చునని బెల్లంకొండ శ్రీనివాస్‌ భావించాడు. ప్రతి సినిమాపై అధికరగా ఖర్చు పెట్టి చేతులు కాల్చుకున్నారు. దీంతో శ్రీనివాస్‌ ఇక భారీ చిత్రాల జోలికి పోవడం లేదు. బడ్జెట్‌లో చిన్న సినిమాలు చేయడానికే మొగ్గు చూపుతున్నాడు.

అక్కినేని అఖిల్‌దీ అదే పరిస్థితి. ముందుగానే అఖిల్‌కి స్టార్‌ స్టేటస్‌ ఇచ్చేసి అందుకు తగ్గట్టే భారీ బడ్జెట్‌ పెట్టారు. వరుసగా రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అదే ఆయా చిత్రాలని మిడ్‌ బడ్జెట్‌లో తీసినట్టయితే కనీసం యావరేజ్‌ రిజల్ట్‌ అయినా వచ్చేది. దీంతో రియలైజ్‌ అయిన నాగార్జున ఇక పెట్టుబడితో అఖిల్‌ని నిలబెట్టే ప్రయత్నం మానుకున్నారు. ప్రస్తుతం అతను మిస్టర్‌ మజ్ను అనే మీడియం బడ్జెట్‌ సినిమా చేస్తున్నాడు.

అఖిల్‌కి స్టేబుల్‌ మార్కెట్‌ ఏర్పడే వరకు మళ్లీ భారీ ప్రయత్నాలు చేయరట. తదుపరి చిత్రాలని కూడా ఇరవై కోట్ల బడ్జెట్‌లోనే చేయడానికి చూస్తున్నారట. వీళ్లిద్దరూ ఇప్పుడు తక్కువ బడ్జెట్‌కి పరిమితం కావడంతో చాలా మంది నిర్మాతలు ఈ యువ హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఎవరి మార్కెట్‌ అయినా నెమ్మదిగానే పెరగాలని త్వరగానే తెలుసుకోవడం వల్ల వీరికి ప్లస్సే అవుతోంది.

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments