ఆ నలుగురికి ఎబిసిడి

ఎబిసిడి.. మలయాళంలో హిట్ అయిన మంచి సినిమా. దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన సినిమా. దాన్ని తెలుగులో మధురశ్రీధర్ రీమేక్ చేసారు. అల్లుశిరీష్ హీరోగా చేసిన ఈ సినిమా అడియో ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఈ సినిమాను 17న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా నలుగురికి కీలకంగా మారింది. మధురశ్రీధర్ మంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే పెళ్లిచూపులు తరువాత మళ్లీ సరైన హిట్ పడలేదు. మళ్లీ పెళ్లిచూపులు నిర్మాతల ద్వయం కలిసి ఈ సినిమా అందిస్తున్నారు. యాష్ రంగినేని, మధుర శ్రీధర్ లకు మళ్లీ అలాంటి విజయం అవసరం ఎంతయినా వుంది.

హీరో అల్లుశిరీష్ ఇప్పటికి హిట్ అనిపించుకున్న సినిమాలు చేసినా, ఇంకా కెరీర్ స్పీడ్ అందుకోలేదు. ఈ సినిమా ఆ లోటు తీర్చాల్సి వుంది. అల్లుశిరీష్ ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. మ్యూజిక్ డైరక్టర్ సెలక్షన్ దగ్గర నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. అందువల్ల ఈ సినిమా హిట్ కావడం ఆయనకు కూడా అవసరం.

డైరక్టర్ సంజీవ్ రెడ్డి కూడా ఈ సినిమా కీలకం. కొత్త దర్శకుల అవసరం టాలీవుడ్ కు చాలావుంది. అందువల్ల ఈ సినిమా విజయం సాధిస్తే ఆయనకూ మాంచి అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. ఆ విధంగా నలుగురికి చాలా అవసరం అయిన ఏబిసిడి సెన్సారు నిన్న పూర్తయింది. చాలా షార్ప్ గా, ఫన్ ఎంటర్ టైనర్ గా మూవీ వుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

Show comments