4న గాడ్ ఫాదర్ లుక్

మలయాళంలో మంచి ప్రశంసలు అందుకున్న సినిమా లూసిఫర్. దీని రీమేక్ నే తెలుగులో మెగాస్టార్ చేస్తున్న లూసిఫర్. మోహన్ రాజా దర్శకుడు. 

గాడ్‌ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 4న సాయంత్రం 5:45 గంటలకు లాంచ్ చేయనున్నారు. గాడ్‌ఫాదర్ రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ఫస్ట్ లుక్ డేట్ ని ప్రకటించింది.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరు..సల్మాన్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే ఓ సాంగ్ కూడా వుంది. ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

టాప్ టెక్నికల్‌ టీమ్‌ గాడ్ ఫాదర్ కోసం పని చేస్తున్నారు. వెటరన్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్‌ అందిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.

Show comments