హీరోయిన్ కు షాకిచ్చిన టాలీవుడ్ స్టార్స్

ఇండస్ట్రీలో బంధాలన్నీ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వ్యక్తిగత స్థాయిలో బంధాలు, స్నేహాలు ఇక్కడ చాలా తక్కువ. ఆ సినిమా వరకు కలిసి చేశామా, పారితోషికం పుచ్చుకున్నామా, మరో సినిమాకు షిఫ్ట్ అయ్యామా అన్నట్టుంటుంది వ్యవహారం. ఫలానా హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్ అనే డైలాగులు ఇంటర్వ్యూల్లో చెప్పుకోడానికి బాగుంటాయి కానీ, వాస్తవంగా చూసుకుంటే ఆ స్నేహాలు పెద్దగా పనిచేయవు.

రీసెంట్ గా ఓ హీరోయిన్ హైదరాబాద్ లో కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంది. ఆమెకు వ్యాపారాలు కొత్త కాదు. హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైమ్ లోనే ఆమె బిజినెస్ ప్రారంభించింది. ఇప్పుడామెకు అవకాశాలు తగ్గాయి. అయితే పాత పరిచయాలు మాత్రం అలానే ఉన్నాయి.

ఆ పరిచయాలతో తన కొత్త బిజినెస్ ఓపెనింగ్ కు కొంతమంది స్టార్స్ ను తీసుకురావాలనుకుంది. స్టార్స్ అంటే చిన్న హీరోలు కాదు, టాలీవుడ్ లో బడా హీరోలే. ఈమె ఫోన్ చేసిన వెంటనే వాళ్లు లిఫ్ట్ చేశారు కూడా. అసలు మేటర్ చెప్పిన వెంటనే సారీ చెప్పి తప్పించుకున్నారు. ఈ విషయంలో ఒక్కో హీరో ఒక్కో సాకు చెప్పాడంట.

ఓ హీరోను అడిగితే ఎన్నికల ప్రచారం ఉందన్నాడట. మరో హీరోను అడిగితే, కొత్త సినిమా లుక్ బయటపడుతుందని చెప్పి తప్పించుకున్నాడట. ఇంకో హీరోను అడిగితే, తండ్రి ఆదేశానుసారం బయట కార్యక్రమాలకు కొన్నాళ్లపాటు దూరంగా ఉంటున్నానని, రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడట.

ఇలా ఒక్కో హీరో ఒక్కో కారణం చెప్పి తప్పించుకున్నాడట. దీంతో చేసేదేం లేక తనకు తెలిసిన ఇతర హీరోలకు కూడా ఫోన్ చేయడం మానేసిందట ఈ స్లిమ్ బ్యూటీ. ఓపెనింగ్ కే రాని హీరోలు ఇక ఆమెకు సినిమా అవకాశాలిస్తారా..?