నిజంగా పుకార్లు వస్తున్నాయా.. పుట్టిస్తోందా..?

బాలీవుడ్ లో ఓ పాడు కల్చర్ ఉంది. నిత్యం వార్తల్లో నలిగేందుకు హీరోయిన్లు కొన్ని పద్ధతులు ఫాలో అవుతుంటారు. సినిమాలు తగ్గినప్పుడు, క్రేజ్ పెంచుకోవడానికి ఇలాంటివి చేస్తుంటారు. బాయ్ ఫ్రెండ్ తో ఎఫైర్, భారీ సినిమాలో ఆఫర్, యాక్సిడెంట్ రూమర్స్, ప్లాస్టిక్ సర్జరీ గాసిప్స్, హాట్ ఫొటోషూట్స్.. వీటిలో కొన్ని.

ఇప్పుడీ పద్ధతుల్ని పూజాహెగ్డే ఫాలో అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రీసెంట్ గా ఆమెపై చాలా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ గాసిప్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఆమె టీమ్ కావాలనే సర్కులేట్ చేస్తోందా లేక సహజసిద్ధంగానే ఈ ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయా అనేది పెద్ద డౌట్.

మొన్నటికిమొన్న పూజాహెగ్డే బాయ్ ఫ్రెండ్ ఇతడే అంటూ కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. ఓ 2 రోజుల పాటు అవి వైరల్ అయ్యాయి. ఆ తర్వాత దాదాపు 50 కోట్లు పెట్టి ముంబయిలో ఓ ప్రాపర్టీ కొనుగోలు చేసిందంటూ ప్రచారం. అది జరిగిన కొన్ని రోజులకే సౌత్ లో ఓ పెద్ద సినిమాలో ఆఫర్ అంటూ పుకారు.

ఇలా మినిమం గ్యాప్స్ లో పూజాహెగ్డేపై ఏదో ఒక వార్త ప్రచారంలో ఉంటూ వస్తోంది. ప్రస్తుతం సినిమాల్లేకపోయినా, ఈ ప్రచారంతో ఆమె నిత్యం లైమ్ లైట్లో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆమెపై జరిగింది ప్రచారమా లేక నిజమా అనే విషయం పక్కనపెడితే, పూజా మాత్రం తను అనుకున్నది సాధించినట్టే కనిపిస్తోంది.