గ్రూపు లీడర్ల ప్రభావం ఎలా వుంటుందో?

జనసేనకు టికెట్ లు ఇచ్చిన ప్రతి చోటా తెలుగుదేశం పార్టీకి మంచి బలమైన నాయకులు వున్నారు. పార్టీ పట్టిష్టంగా వుంది. అదే ప్లస్.. అదే మైనస్.. జనసేన కు. కలిసి వస్తే జనసేన గెలుపు వీజీ. కలిసి రాకపోతే విజయం అనుమానమే. ఇప్పుడు ఈ విషయమే క్లారిటీగా తేలడం లేదు.

చాలా అంటే చాలా నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులతో కలిసి తిరుగుతున్నట్లే కనిపిస్తున్నారు. కానీ ఎవరి ఓట్లను వారు కాపాడుకోవాలి అనే పెద్దతిలో ఎవరి ములాఖత్ లు వారు చేసుకుంటున్నారు. ఈ మీటింగ్ లు, డిస్కషన్లు తమ వర్గం ఓట్లు జాగ్రత్తగా పోల్ అయ్యేలా చూడడానికా? లేక తెరవెనుక ఏదైనా కుట్రలు జరుగుతున్నాయా? అన్నది క్లారిటీ రావడం లేదు.

గ్రూపులు అన్నీ కలిసి పనిచేయడం లేదు. అందరూ జనసేన తో వున్నట్లు కనిపిస్తున్నారు కానీ మళ్లీ తెలుగుదేశం పార్టీ వరకు వస్తే ఎవరికి వారే. అది పిఠాపురంలో అయినా, కాకినాడ రూరల్ అయినా, అనకాపల్లి, ఉండి ఇలా ఏ నియోజకవర్గం అయినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ఉండి లో ఆర్ఆర్ఆర్ కు అటు రెబల్స్ బెడద ఇటు గ్రూపుల బెడద రెండూ వున్నాయి. విజయనగరంలో అశోక్ కుమార్తెకు ఇదే సమస్య మైనస్ అవుతుందని టాక్. అనకాపల్లిలో, దాడి వర్గం, బుద్దా వర్గం, పీలా గోవింద్ వర్గం దేనికి అవే పని చేస్తున్నాయి. కాకినాడ రూరలో పిల్లి అనంత లక్ష్మి వర్గం ఏం చేస్తుందో అని అనుమానం. పిఠాపురంలో వర్మ ను వదలకుండా పట్టుకుని దగ్గర వుంచుకుంటున్నారు పవన్.

ఇలా ప్రతి చోట్లా ప్రతి వర్గాన్ని అస్తిత్వ సమస్య వెంటాడుతోంది. ఊపు వుందని తెలుగుదేశం మీడియా ఊదరగొడుతూంది. టైట్ ఫైట్ వుందని గ్రవుండ్ రియాల్టీ చెబుతోంది. ఇలాంటి టైమ్ లో వన్స్ తమ నియోజకవర్గం తమ పట్టు జారిపోతే ఇక మళ్లీ వెనక్కు రాదు. నామినేటెడ్ పోస్ట్ ల వల్ల ఏ ప్రయోజనం ఎలా వున్నా, అధికార వర్గాల్లో, జనాల్లో అంత పట్టు వుండదు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే. ఈసారి కనుక అపోజిషన్ గెలిచినా మరోసారి మనం ప్రయత్నం చేసుకోవచ్చు. అలా కాకుండా ఈసారి మన పార్టీనే గెలిచినా, నియోజకవర్గం మన చేతుల నుంచి జారిపోతుంది అనే భయం ఈ గ్రూపు లీడర్లను వెంటాడుతోంది.

ఇప్పుడు ఇదే కీలకంగా టఫ్ ఫైట్ గా వున్న పోటీని అటు లేదా ఇటు ఎడ్జ్ వుండేలా మార్చడానికి.