దేవకి నందన… పాట బాగుందన

అలనాటి హీరో కృష్ణ మనమడు గల్లా అశోక్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘దేవకి నందన వాసుదేవ’. గతంలో గుణ 369 సినిమా అందించిన అర్జున్ జంధ్యాల దర్శకుడు. ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతంగా వినిపించే పేరు ప్రశాంత్ వర్మ. ఆ దర్శకుడు ఈ సినిమాకు కథ అందించారు. కాస్త భారీగా నిర్మిస్తున్నారు ఈ సినిమాను.

ఎందుకంటే ఈ సినిమా సింగిల్ జానర్ కాదు. ఇటు లవ్, అటు డివోషన్ టచ్, ఈ రెండింటితో పాటు యాక్షన్ కూడా మిక్స్ చేసిన కథ ఇది. ఈ సినిమా కు ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేసారు. అందులో భాగంగా ‘ఏమయ్యిందే గుండెకు’ అనే పాటను విడుదల చేసారు.

ఏమయ్యిందే గుండెకు అంటూ ఆరంభమైన గీతం సంగీత దర్శకుడు భీమ్స్ శైలికి భిన్నంగా సాగడం విశేషం. ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారిన భీమ్స్ అంటే మాస్ బీట్ గుర్తుకు వస్తుంది. కానీ ఈ పాటను మాత్రం క్లాస్ మెలోడీగా అందించాడు. ఈ తరహా పాటలు కూడా తను బాగా అందించగలడని ప్రూవ్ చేసుకోవడానికి చేసినట్లు ఉంది. సినిమా విడుదల లోగా పాట బాగా వైరల్ అయ్యే అవకాశం వుంది. ముఖ్యంగా ఎఫ్ ఎమ్ ల్లో ఇలాంటి పాటలు బాగా వినిపిస్తాయి. ఈ పాటను సురేష్ గంగుల రాసారు.

లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ ఏమయ్యిందే ప్రోమోతో టీజ్ చేసిన తర్వాత, మేకర్స్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. రసోల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ పాటను అందంగా వడిసిపట్టింది.