జీవితంలో భయపడనంటున్న భామ

ప్రతి మనిషికి కొన్ని భయాలుంటాయి. సెలబ్రిటీలకు ఇవి ఇంకాస్త ఎక్కువ. అయితే హీరోయిన్ రాశిఖన్నా మాత్రం తనకు భయం అంటే ఏంటో తెలియదంటోంది. జీవితంలో భయపడినట్టు తనకు గుర్తులేదని చెబుతోంది.

"నేను జీవితంలో భయపడను. ఇప్పటివరకు భయపడలేదు. చిన్నప్పుడు 3-4 ఏళ్ల వయసులో భయపడి ఉంటాను, నాకు ఊహ తెలిసిన తర్వాత భయం అంటే ఏంటో తెలియదు. బాక్ సినిమా షూటింగ్ లో కొన్ని సన్నివేశాల్లో భయపడాల్సి వచ్చింది. భయాన్ని ఎలా నటించాలో నాకు తెలియలేదు. ఓ భయంకరమైన సన్నివేశానికి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థంకాలేదు."

ఇలా తనకు భయం అంటే ఏంటో తెలియదంటోంది రాశిఖన్నా. ఎన్నో హారర్ సినిమాల్ని అర్థరాత్రి చూసి పడుకున్నానని, ఎలాంటి భయం అనిపించలేదని అంటోంది. తను చూసిన బెస్ట్ హారర్ సినిమా భూత్. ఆ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని చెబుతోంది.

బాక్ అనే హారర్ సినిమాలో నటించింది రాశీ. ఈ సినిమా మాత్రం అందరూ భయపడేంత ఉండదని, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి లాంటి కమెడియన్ల కామెడీ కూడా ఉంటుందని అంటోంది. ఫ్యామిలీ అంతా కలిసి బాక్ సినిమా చూడొచ్చని హామీ ఇస్తోంది.

Click Here More Photos