పవన్ ఇల్లు అసిస్టెంట్ అమ్మేస్తాడు!

అవును పవన్ ఇల్లు కట్టుకున్నారు.. ముచ్చటగా మంచి ఇల్లు. అందులో వుందాం అనుకున్నారు. కానీ దాన్ని మెయింటెయిన్ చేయలేక అమ్మేసారు. కానీ అలా చెప్పుకోవడం నామర్దా కదా .. అందుకే తన అసిస్టెంట్ బలవంతంగా తన చేత అమ్మించేసారు. లేదా తనే అమ్మేసాడు అంటున్నారు.

కాస్త కన్ఫ్యూజ్ గా వుంది కదా. పవన్ మాటలు, ప్రసంగాలు అలాగే వుంటాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టింది మెగాస్టార్ చిరంజీవి. దాన్ని నిర్వహించలేక కాంగ్రెస్ లో కలిపేసింది ఆయనే. అలా కలపడం ద్వారా లబ్ది పొంది, కేంద్రంలో మంత్రి పదవి పొందింది ఆయనే. కానీ పవన్ అలా అనుకోవడం లేదు. ప్రజారాజ్యం పార్టీని బలవంతంగా కన్నబాబు అనే జస్ట్ పార్టీ సభ్యుడు లేదా పార్టీ ఎమ్మెల్యే అమ్మేసేలా చేసారు అంటున్నారు. అదే సందర్భంలో అక్కడే వున్న మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంచి వాడే. కన్నబాబే చెడ్డవాడు.

కన్నబాబు అంటే మొదటి నుంచీ పవన్ కు కోపమే. తను ఎమ్మెల్యే కాలేదు, తమ దగ్గర చేతులు కట్టుకుని వుండే వాడు ఎమ్మెల్యే, మంత్రి అయిపోయాడు అన్నది పవన్ బాధ. ఆ బాధ ఇన్నాళ్లూ పైకి చెప్పలేదు. ఇప్పుడు కక్కేసారు. ‘కన్నబాబూ రా అంటే పరుగెత్తుకుని వచ్చేవాడు. డొక్కు స్కూటర్ మీద తిరిగేవాడు. మా అన్న ఏదైనా సమాచారం అడిగితే ఇచ్చే పని చేసేవాడు. అంచెలంచెలుగా ఎదిగిపోయాడు’ అనేసి మళ్లీ నాలుక కర్చుకున్నాడు. ఎదగొచ్చు…కానీ అందరినీ తొక్కేసి ఎదగకూడదు అంటూ సవరణ ఇచ్చుకున్నారు.

కన్నబాబు ఎవర్ని తొక్కేసి ఎదిగారు? ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ తో పాటే కదా కాంగ్రెస్ లోకి వెళ్లింది. చాలా మంది కాంగ్రెస్ వాదుల మాదిరిగానే కదా వైకపాలోకి వచ్చింది. కష్టపడి ప్రజల అభిమానం చూరగొనకుండా గెలవగలరా? మరి ఇక్కడ తొక్కేయడం అన్న పాయింట్ ఎక్కడుంది?

పవన్ ఎంత మంది హీరోలను తొక్కేసి ఈ స్థాయికి వచ్చారు? అలా అంటే ఒకె అనగలరా? అసలు మెగాస్టార్ బ్రదర్ కాకుండా వుంటే పవన్ కు ఈ రోజు ఆ డొక్కు స్కూటర్ అయినా వుండేదా? తమ దగ్గర పని చేెసేవాడు పనివాడిలాగే వుండిపోవాలి. తమను దాటిపోకూడదు అనే నైజం ఎవరికీ ఉండకూడదు. పవన్ తన నైజం అలాంటిది అని బయటపెట్టుకున్నారు ఈ రోజు.

గత అయిదేళ్లలో ఇదే కన్నబాబు ఎన్నిసార్లు చిరంజీవితో టచ్ లో వున్నారు. జగన్ ను మెగాస్టార్ కు మధ్య కమ్యూనికేషన్ కన్నబాబే అన్న సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ సంగతి పవన్ కు తెలియదా?

పవన్ బాధ ఒకటే తను ఎమ్మెల్యే కాలేకపోయాను, సిఎమ్ కాలేకపోయాను. జగన్ తనకన్నా చిన్న అయినా సిఎమ్ అయిపోయాడు. కన్నబాబు తమ దగ్గర చెేతులు కట్టుకుని వుండేవాడు. మంత్రి అయిపోయాడు. అదే కదా పవన్ బాధ ఆ ఇద్దరి మీద.