కల్కి- కేవలం కొన్ని షాట్ ల కోసం

ప్రభాస్- నాగ్ అశ్విన్ ల కల్కి సినిమా ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. అమితాబ్ ను అశ్వద్దామగా పరిచయం చేస్తూ వదిలిన గ్లింప్స్ జనాలను బాగానే ఆకట్టుకుంది. కానీ విడుదల డేట్ మాత్రం ఇంకా క్లారిటీ లేదు. విడుదల డేట్ కు టికెట్ ల రేట్లు ఓ సమస్య అన్న టాక్ వుంది. అయితే సంబంధిత ఐఎఎస్ అధికారులు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందువల్ల మే 30న విడుదలకు పెద్దగా సమస్య లేదన్నది ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.

అయితే సినిమాకు సంబంధించి ఓ మూడు నాలుగు సిజి షాట్స్ రావాల్సి వుందట. ఇప్పటికే వచ్చాయి. కానీ అవి సంతృప్తికరంగా లేక మళ్లీ చేయమని పంపారు. జస్ట్ నాలుగు షాట్లే కదా, సినిమా అంతా బాగున్నపుడు ఈ షాట్స్ తో సమస్య ఏమీ వుండదు, విడుదల చేసేయాలనే సలహా బయ్యర్లది. కానీ సినిమాలో ఎక్కడా వంక పెట్టడానికి లేకుండా వుండాలన్నది దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచన. అందువల్ల ఆ సిజి ల వర్క్ క్లారిటీ లేకుండా డేట్ చెప్పలేకపోతున్నారు.

జూన్ నెలకు వెళ్లిపోతే బెటర్ అనే ఆలోచన నిర్మాతలకు వుంది. కానీ ఏకంగా జూలైకి షిప్ట్ చేయమన్నది హీరో ప్రభాస్ సలహా. దాని వల్ల మొత్తం డిస్కషన్ లో పడి, డేట్ ఇంకా బయటకు రాలేదు. ఇవన్నీ ఇలా వుంటే సినిమా డిజిటల్ రైట్స్ అమ్మకాల డీల్ ఇంకా పూర్తి కాలేదు కనుక, తొందరపడి డేట్ వేయడం సరికాదని, ఆగారనే టాక్ కూడా వినిపిస్తోంది.

మొత్తం మీద ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ క్లారిటీ రావడానికి మరి కొన్ని రోజులు పట్టవచ్చు.