పవన్ వల్ల లాభపడినదెవ్వరు?

పవన్ కళ్యాణ్ వల్ల ఇండస్ట్రీలో ఎవ్వరు బాగుపడిన వారు లేరు అన్నది జనసేన నుంచి వైకాపాలోకి వచ్చిన పోతిన మహేష్ ఆరోపణ. అది ఆరోపణే అనుకుందాం.

నిజంగా పవన్ వల్ల ఇండస్ట్రీలో బాగుపడిన వారు ఎవరైనా వున్నారా? ఇండస్ట్రీలో చాలా మంది చేయూతనిచ్చి సాయం చేసిన వాళ్లు ఎవరు అంటే ముందుగా దాసరి పేరు, రామానాయుడు, ఈవీవీ, కోడి రామకృష్ణ ఇలాంటి పేర్లు వినిపిస్తాయి తప్ప మెగా హీరోల పేర్లు అయితే కాదు. సరే ఆ ముచ్చట అంతా అలా వుంచి పవన్ సంగతి చూస్తే కేవలం పవన్ లిఫ్ట్ ఇవ్వడం వల్ల, అవకాశం ఇవ్వడం వల్ల మాత్రమే బాగుపడ్డారు అనే వారు ఎవరూ లేనట్లే.

బండ్ల గణేష్ కు గబ్బర్ సింగ్ ఇవ్వడానికి కారణం, ప్రేమ కాదు, తీన్ మార్ లో డబ్బులు పోగొట్టుకోవడం వల్ల. తరువాత శరత్ మరార్ ను దగ్గరకు తీసింది తనకు ఓ మనిషి సాయం వుండాలని. అప్పట్లో తెలుగుదేశంతో మాట్లాడడానికి మధ్యలో ఒకరు వుండాలని. తెలుగుదేశంతో అప్పట్లో అన్ని వ్యవహారాలు శరత్ మరార్ నే మాట్లాడేవారు. అలాంటి శరత్ దూరం కావడానికి కారణం, కాటమరాయుడు సినిమా నిర్మాణంలో జరిగిన సంఘటనలు.

శరత్ బయటకు వెళ్లేలా ఎవరు పొగపెట్టారు అన్నదాని మీద రకరకాల గుసగుసలు వున్నాయి. హరి హర నిర్మాత రత్నం సంగతి, పరిస్థితి తెలిసిందే. అజ్ఙాతవాసి, భీమ్లానాయక్ తీసి ఆ నిర్మాతలు ఏమైనా లాభాలు చేసుకున్నారా? అత్తారింటికి నిర్మాత భోగవిల్లి ప్రసాద్ కు తెలుసు, తనకు ఏమేరకు డబ్బులు వచ్చాయో?

మరి ఎవరు బాగుపడినట్లు? ఇండస్ట్రీ టాక్ ను బట్టి ఒకే ఓక్కరు.. దర్ళకుడు త్రివిక్రమ్ మాత్రం కాస్త ఆదాయం సంపాదించారని అంటారు. ఈ మేరకు అనేక గ్యాసిప్ లు వున్నాయి. వకీల్ సాబ్ సినిమా సెట్ చేసారని, బ్రో సినిమాలో ముందుగా వాటా వుండేదని, కానీ తరువాత వేరే విధంగా డీల్ చేసుకున్నారని, ఓజి సినిమా ను సెట్ చేయడం వెనుక లెక్కలు వేరే అని ఇలా రకరకాలుగా గ్యాసిప్ లు వున్నాయి. అందువల్ల పవన్ వల్ల ఇండస్ట్రీలో లాభపడింది ఎవరైనా వుందా అంటే అది త్రివిక్రమ్ మాత్రమే అనుకోవాలేమో?