130 కోట్లా? దేవరా?

ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో తయారవుతున్న భారీ పాన్ ఇండియా సినిమా దేవర. ఈ సినిమా మార్కెటింగ్ స్టార్ట్ అయింది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. చాలా గ్యాప్ వచ్చేసింది ఎన్టీఆర్ సినిమా విడుదలై. అందువల్ల ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా వున్నారు. అందువల్ల మేకర్స్ కొంచెం ఫ్యాన్సీ రేట్లే కోట్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఓవర్ సీస్ ముందుగా 80 లక్షల అడ్వాన్స్ తీసుకుని, మాట ఇచ్చారు. కానీ సినిమా ఎప్పటికి వస్తుంది అన్న క్లారిటీ ఇవ్వడం లేదనే ఆలోచనతో ఆ బయ్యర్ వెనక్కు జరగడం, వేరే బయ్యర్ కు ఇవ్వడం జరిగిపోయింది.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మార్కెట్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 130 కోట్ల మేరకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ రేట్ అంటే బయ్యర్లు కాస్త ముందు వెనుక ఆలోచిస్తున్నారని బోగట్టా. బహుశా ఏదో పాయింట్ వద్ద సెటిల్ కావచ్చు. ఇంకా ఇప్పుడే ఎంక్వయిరీలు, బేరాలు మొదలయ్యాయి కనుక, మరి కొన్ని వారాల్లో ఒక్కో ఏరియా సెటిల్ అవుతుంది.

కొరటాలకు మైత్రీ సంస్థ అత్యంత సన్నిహితంగా వుంటుంది. అందువల్ల నైజాం ఏరియా మైత్రీ తీసుకుంటుందా? వేరే వాళ్లు ఎంటర్ అవుతారా అన్నది తెలియాల్సి వుంది.  ప్రస్తుతానికి అయితే అన్ని ఏరియాలు ఓపెన్ గానే వున్నాయి.