దర్శకుల చుట్టూ ఆ హీరో

సినిమాలు హిట్ అయితే చాన్స్ ల కోసం వెదుక్కోనక్కరలేదు. అదే కనుక సినిమాలు ఫ్లాప్ అయితే వేటాడాల్సిందే.

తొలిసినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయినా తరువాత హిట్ అన్నది పడలేదు ఆ హీరోకి. ఇప్పుడు తనతో సినిమా తీసేవారు కనిపించడం లేదు. సరైన కాంబినేషన్ సెట్ అయితే నిర్మాతను ఎవరో ఒకరిని పట్టుకోవచ్చు. కానీ ఏ డైరక్టర్ వస్తారు ముందుకు. ఎవరో ఒకరు వస్తే దాన్ని కాంబినేషన్ అనరు. కాస్త ఖాళీగా వున్న మిడ్ రేంజ్ డైరక్టర్ లు ఎవరు అని వెదకడం ప్రారంభించారట ఆ హీరో.

సాధారణంగా ఇంతో అంతో బ్యాకింగ్ వుంది, కెరీర్ లో ఓ రేంజ్ హిట్ వున్న హీరోలు నేరుగా వెళ్లి చాన్స్ ల కోసం అడగరు. మహా అయితే మేనేజర్లు మాత్రం కిందా మీదా అవుతారు. కానీ ఇక్కడ అవసరం తనది, పరిస్థితి సరిగ్గా లేదు కనుక, హీరోనే నేరుగా వెళ్లి ఒకరిద్దరు మాస్ మిడ్ రేంజ్ డైరక్టర్లను కలిసి తనతో సినిమా చేయమని, నాన్ స్టాప్ గా వెంటనే డేట్ లు ఇస్తా అని చెబుతున్నారట. అవసరం అయిన చోట రిఫరెన్స్ లు కూడా వాడుతున్నారట.

కానీ ఆ దర్శకులు కూడా తాము ఆ హీరోతో చేస్తే, నిర్మాతలు ఎవరు ముందుకు వస్తారు అని లెక్కలు కడుతున్నారట. అసలు బడ్జెట్ ఎంత అవుతుంది. దానికి తగిన మార్కెట్ వుందా.. నిర్మాతలు ముందుకు వస్తారా అన్న లెక్కలు వేసి సైలంట్ అవుతున్నారని టాక్. 2025 చివరి వరకు నాన్ థియేటర్ పరిస్థితులు ఇప్పుడు వున్నట్లే వుండి, థియేటర్ మార్కెట్ రోజు రోజుకు డౌన్ అవుతూ వుంటే, చాలా మంది మిడ్ రేంజ్ హీరోలకు కష్టమే.