బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న సమంత?

మయొసైటిస్ సైడ్ ఎఫెక్టుల నుంచి పూర్తిగా కోలుకున్న సమంత, ఇప్పుడు పూర్తిస్థాయిలో యాక్టివ్ అయింది. సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులు, ఫొటోలు చూస్తుంటే.. గ్లామర్ హీరోయిన్ పాత్రలకు ఆమె రెడీ అనే విషయాన్ని ఇట్టే పసిగట్టొచ్చు ఎవరైనా.

ఆ సంకేతాలకు మరింత బలం చేకూరుస్తూ త్వరలోనే బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతోంది సమంత. ఓ భారీ బడ్జెట్ సినిమాతో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతోంది. తాజా సమాచారం ప్రకారం అది అల్లు అర్జున్ సినిమా.

అల్లు అర్జున్, అట్లీ సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా సమంతను దాదాపు కన్ ఫర్మ్ చేశారు.

బన్నీ-సమంతది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరూ కలిసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేశారు. ఆ తర్వాత బన్నీ నటించిన పుష్ప-1 సినిమాలో సమంత ఐటెంసాంగ్ చేసింది. అది పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్టయింది.

ఇక అట్లీ-సమంతది కూడా సూపర్ హిట్ కాంబినేషన్. అట్లీ దర్శకత్వంలో సమంత 2 సినిమాలు చేసింది. అందుకే బన్నీతో చేయబోయే సినిమా కోసం సమంతను తీసుకోవాలని అనుకుంటున్నారట. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి.