డిజె టైటిల్ సాంగ్ రీమిక్స్

డిజె టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ కు ఎన్ని అదనపు హంగులు కావాలో అన్నీ సెట్ చేసినట్లు కనిపిస్తోంది. తొలిభాగం లో లేని చాలా కమర్షియల్ పాయింట్లు యాడ్ చేసుకుంటూ వెళ్లినట్లు కనిపిస్తోంది. లిప్ టు లిప్ కిస్ లు, డబుల్ మీనింగ్, సింగిల్ మీనింగ్ డైలాగులు, అనుపమ కవ్వింపు లుక్స్. ఇలా ఒకటి కాదు. ఎన్ని చేసినా, డిజె టిల్లు కు పెద్ద అడ్వాంటేజ్ టైటిల్ సాంగ్. టిల్లు స్క్వేర్ లో కూడా మంచి పాటలు పడ్డాయి కానీ ఎంతయినా ఆ టైటిల్ సాంగ్ వేరే.

అందుకే ఆ సాంగ్ ను తీసుకుంటూ, రీమిక్స్ చేసారట. మరి ఈ రీమిక్స్ టైటిల్ లో వస్తుందో, మధ్యలో వస్తుందో చూడాలి. ఇదిలా వుంటే రాధిక గా పాపులర్ అయిన నేహాశెట్టి, రెండో భాగంలో జస్ట్ కామియో గా కనిపిస్తుందట. పార్ట్ వన్ లో ఓ మర్డర్ లో టిల్లు ఇరుక్కోవడం అనే థ్రిల్లర్ సబ్జెక్ట్ రన్ అవుతుంది. కానీ పార్ట్ 2 లో తుపాకులు, కాల్పులు, దుబాయ్, మాఫియా వ్యవహారాలు జోడించినట్లు కనిపిస్తోంది.

తొలి ట్రయిలర్ లో కథను ఎక్కువగా రివీల్ చేయలేదు కానీ, విడుదలకు ఒక రోజు ముందు వదిలిన ట్రయిలర్ లో మాత్రం కథ ఎలా వుండబోతోందో కొద్దిగా వెల్లడించారు.