ఎట్టకేలకు వారాహిని బయటకు తీస్తున్న పవన్!

టీడీపీ యువనేత నారా లోకేష్ యువ‌గ‌ళం పాదయాత్ర రాయలసీమలో పూర్తి చేసుకోబోతున్న దృష్ట్యా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో బస్సు యాత్ర చేయబోతున్నట్లు జనసేన ప్రకటించింది. ఇన్ని రోజులు లోకేష్ పాదయాత్రకు సరైన కవరేజ్ రాదని భావించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యాత్రను వాయిదా వేయించిన సంగతి అందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ తొలివిడతగా గోదావరి జిల్లాల్లో ఈనెల 14 నుండి ప్ర‌తి నియోజకవర్గంలో రెండు రోజులు పాటుగా సుడిగాలి పర్యటన చేయబోతున్నట్లు జనసేన ప్రతినిధి నాదేండ్ల మనోహర్ ప్రకటించారు. గ‌తంలోనే ఎన్నికల ప్రచారం కోసం వారాహి పేరుతో ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేయించి యాత్ర చేయ‌బోతున్న‌ట్లు నానా హ‌డ‌వుడి చేశారు. తీరా లోకేష్ పాద‌యాత్ర మొద‌లు పెట్ట‌గానే ప‌వ‌న్ సైలెంట్ అయిపోయారు. 

కాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను సింగిల్ గా వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పిన నేప‌థ్యంలో.. టీడీపీ- జ‌న‌సేన పొత్తు దాదాపు ఖాయం అవ్వ‌డంతో పాటు సీట్ల స‌ర్దుబాటు కోసం త‌న పార్టీ అంతో ఇంతో త‌న పార్టీ బ‌లం ఉంద‌ని భావిస్తున్నా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందుగా గోదావ‌రి జిల్లాల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. 

కాగా ఇప్ప‌టికే తన‌కు సీఎం అయ్యే అవ‌కాశ‌మే లేద‌ని.. రాయ‌ల‌సీమ‌లో తన‌కు బ‌లం లేద‌ని స్వ‌యంగా పవ‌న్ ప్ర‌క‌టించుకున్నా విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పొత్తులో భాగంగా  ఇర‌వై సీట్ల లోపే జ‌న‌సేనకు ఇవ్వ‌డానికి సుముఖంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. బ‌హుశా ప‌వ‌న్ యాత్ర త‌ర్వాత సీట్లు పెరిగే అవ‌కాశం ఉందంటూన్నారు జ‌న‌సేన నాయ‌కులు.