మీడియా సంఘానికి చెల్లని చెక్కు?

టాలీవుడ్ మీడియా సంఘాలకు సినిమా నిర్మాతలు, సెలబ్రిటీలు సహాయం అందివ్వడం కామన్. సభ్యుల భీమా, ఇతరత్రా సహాయ కార్యక్రమాలకు సినిమాల విడుదలల ముందు సెలబ్రిటీల సాయం అందిస్తుంటారు. లేదా వారి వారి బర్త్ డే ల సందర్భంగా కూడా సహాయాలు ప్రకటిస్తుంటారు. 

అయితే ఇవన్నీ ఇరువైపులా చర్చల దరిమిలా జరుగుతుంటాయి. అయితే ఆ మధ్య నిర్మాత పిలవని పేరంటం మాదిరిగా రెండు లక్షల సహాయం అందించడానికి ముందుకు వచ్చారట. తన బర్త్ డే సందర్భంగా ఆయన ఈ సహాయం ప్రకటిస్తానన్నారట.

దానికే మీడియా జనాలు కాస్త ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ఆ నిర్మాత నుంచి అలాంటి వ్యవహారం ఊహించలేదు కనుక. సరే, వచ్చారు. రెండు లక్షల చెక్ ఇచ్చారు. వెళ్లారు. కానీ కట్ చేస్తే ఆ చెక్ బౌన్స్ అయిందని బోగట్టా. బ్యాంకులో సరిపడా డబ్బులు లేక చెక్ బౌన్స్ అయినట్లు తెలుస్తోంది.

దాంతో ఈ విషయం ఆయనకు తెలియచేసి, సైలంట్ అయ్యారట మీడియా సంఘ సభ్యులు. ఇది ఆ నోటా ఈ నోటా పడి, మీడియా సభ్యులను దాటి ఇండస్ట్రీలో వినిపించడం ప్రారంభించింది.