పెన్షన్ పై జగన్.. నెలకు మూడు వేలు!

ఇప్పుడు కాదు.. రెండేళ్ల కిందటే జగన్ నవరత్నాలును ప్రకటించినప్పుడే.. పెన్షన్ గురించి ఒకమాట అన్నారు. పెన్షన్ మొత్తాలను రెండు వేల రూపాయలకు పెంచుతామని అప్పట్లో హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి... ఒకవేళ చంద్రబాబు నాయుడు పెన్షన్ మొత్తాన్ని రెండువేల రూపాయలకు పెంచితే, తాము అధికారంలోకి వచ్చాకా దాన్ని మూడువేల రూపాయల మొత్తానికి పెంచుతామని అప్పట్లోనే హామీ ఇచ్చారు. జగన్ అనుకున్నట్టే అయ్యింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నరవత్నాలు పథకాలను అప్పట్లో తప్పుపట్టిన చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత వాటిని ఒక్కొక్కటిగా కాపీకొట్టడం ప్రారంభించారు. అందులో భాగంగా జగన్ చెప్పినట్టుగానే.. పెన్షన్ మొత్తాన్ని రెండు వేల రూపాయలకు పెంచారు. ఎన్నికలు మరో రెండునెలలు ఉన్న నేపథ్యంలో పెన్షన్ మొత్తాలను పెంచి పాలాభిషేకం చేయించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు.

ఇలాంటి నేపథ్యంలో జగన్ ఇంతకు ముందు తను చెప్పిన విషయాన్నే మళ్లీ చెప్పారు. పెన్షన్ మొత్తం మూడు వేల రూపాయలకు పెంచుతామని ప్రకటించారు. ప్రతి అవ్వా తాతకూ పెన్షన్ మొత్తాన్ని మూడు వేల రూపాయలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఒకవైపు రెండు వేల రూపాయలు పెన్షన్ అని.. తెలుగుదేశం పార్టీ వాళ్లు గట్టిగా ప్రచారం చేసుకొంటూ ఉన్నారు. జగన్ మూడు వేల రూపాయలు అంటున్నారు. 

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?

Show comments