జగన్ తో కేటీఆర్ సమావేశం.. అప్ డేట్స్!

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశంలో ఏం చర్చించారు అనే సంగతి గురించి  పూర్తి వివరాలు ఇంకా తెలియడం లేదు కానీ.. ఈ సందర్భంగా జగన్ కు కేసీఆర్ ఆహ్వానం అందిందని మాత్రం తెలుస్తోంది. జగన్ ను లంచ్ లేదా డిన్నర్ మీట్ కు పిలిచాడట కేసీఆర్. కేటీఆర్ ద్వారా జగన్ కు కేసీఆర్ ఆహ్వానం అందింది అని సమాచారం.

ఏపీలో ఎన్నికలు రాబోతూ ఉండటం, ఫెడరల్ ఫ్రంట్.. వంటి విషయాల గురించి కూలంకషంగా చర్చించడానికి జగన్ తో సమావేశం కావాలని కేసీఆర్ అనుకుంటున్నాడట. అందులో భాగంగానే కేటీఆర్ ను పంపించి సమావేశానికి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. 

అంతేకాదు.. త్వరలో కేసీఆర్ నిర్వహించబోయే చండీయాగానికి కూడా జగన్ ను ఆహ్వానించాలని తెరాస అధినేత నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. చండీయాగానికి వీఐపీ ఆహ్వానితుల జాబితాలో జగన్ పేరును చేర్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు చండీయాగం నిర్వహించినప్పుడు చంద్రబాబును ఆహ్వానించాడు కేసీఆర్.

ఇక బాబును పక్కనపెట్టి జగన్ తో సత్సంబంధాలకు కేసీఆర్ ప్రాధాన్యతను ఇస్తున్నాడని స్పష్టం అవుతోంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితితో సంబంధాల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన షరతును విధిస్తోందని సమాచారం.

ప్రత్యేకహోదా విషయంలో ఏపీకి అనుకూలంగా వ్యవహారించాలనేది జగన్ పెడుతున్న షరతుగా తెలుస్తోంది. దీనికి కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. హోదా విషయంలో ఇప్పటికిప్పుడు లేఖ రాసేందుకు అయినా లోక్ సభ, రాజ్యసభలో చర్చ సందర్భంగా అయినా మద్దతు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేసీఆర్ వైపు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ కు సమాచారం అందినట్టు తెలుస్తోంది.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

బాబు, జగన్ తేల్చాలేకపోతున్నారా..!