యూత్ ఫుల్ క్యారెక్టర్లతో 'నన్ను దోచుకుందువటే'

యూత్ ఫుల్ క్యారెక్టర్లు, యూత్ ఫుల్ స్టోరీ, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇలా యూత్.. యూత్.. యూత్.. ఇదే ఇప్పుడు టాలీవుడ్ తారకమంత్రంగా మారింది. నిర్మాతగా మారిన హీరో సుధీర్ బాబు కూడా పక్కాగా ఈ కానెప్ట్ తోనే సినిమా నిర్మించినట్లు కనిపిస్తోంది. 

సుధీర్ బాబు స్వంత సినిమా నన్ను దోచుకుందువటే ట్రయిలర్ విడుదలయింది. రెండు నిమషాలకు పైగా వున్న ఈ ట్రయిలర్ మరీ అద్భుతంగా ఏమీలేదు కానీ, సినిమా జోనర్ ఏమిటి? టార్గెట్ ఆడియన్స్ ఎవరు? సినిమాలో ఏమి వుండబోతోంది? అన్నది క్లారిటీగా చెప్పగలిగింది. 

ప్రెజెంట్ యూత్ థాట్ ప్రాసెస్, వాళ్ల డే టు డే లైఫ్ లో ఎదురయ్యే పాత్రలు, ఎదురయ్యే సిట్యువేషన్ల చుట్టూ డైరక్టర్ నాయుడు కథ రాసుకుని సినిమా తయారుచేసినట్లు కనిపిస్తోంది. హీరో హీరోయిన్లను ఇటు ఫన్ కు అటు ఎమోషన్ కు కలిపి వాడినట్లు కనిపిస్తోంది. పక్కా ఈ జనరేషన్ కుర్రాళ్ల లైఫ్ ల్లోంచి కథను తెచ్చుకు వచ్చినట్లు కనిపిస్తోంది.

సినిమా ఎలా వుండబోతోంది అనే దానికన్నా, సినిమా దేని మీద ఫోకస్ చేసిందన్నది క్లియర్ గా చెప్పగలిగారు. మరి సినిమా ప్రెజెంటేషన్ ఎలా వుంటుందో చూడాలి. మరోవారం రోజుల్లో జనం ముందుకు వస్తుందీ సినిమా.