యశోద...గా..సమంత రెడీ

శకుంతలగా సమంత తన సినిమాను పూర్తి చేసేసింది. మాంచి టైమ్ చూసి విడుదలకు వస్తుంది. ఆ తరువాత తెలుగులో చేయబోయే సినిమాకు శ్రీకారం చుట్టేసింది. 

శ్రీదేవి మూవీస్ పతకాంపై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించే సినిమా సెట్ మీదకు సమంత ఈ రోజు అడుగుపెట్టింది. 

ఇద్దరు కొత్త దర్శకుల కాంబినేషన్ లో తయారయ్యే ఈ థ్రిల్లర్ కు 'యశోద' అనే టైటిల్ పెట్టడం విశేషం. హరీ, హరీష్ అనే ఈ దర్శకులు తయారు చేసిన థ్రిల్లర్ కథకు ఇంప్రెస్ అయిన సమంత ముందుగా ఈ సినిమాను స్టార్ట్ చేసింది.

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడంలో ఈ సినిమాను విడుదల చేస్తారు. మణిశర్మ సంగీతం అందించే ఈ సినిమాను కంటిన్యూగా షూట్ చేసి మార్చి నాటికి పూర్తి చేస్తారు.

Show comments