'వరల్డ్ ఫేమస్' గీత గోవిందం

యంగ్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ లో గీతగోవిందం ఓ మలుపు. అతని రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోపెట్టింది. కానీ ముందు వెనుక చేసిన ద్వారక, నోటా, డియర్ కామ్రేడ్ దారుణ పరాజయాలు. నిర్మాతగా కూడా మీకు మాత్రమే చెప్తా ఓ చేదు అనుభవం. ఇలాంటి టైమ్ లో వస్తోంది 'వరల్డ్ ఫేమస్ లవర్'. పలు ప్రేమకథల ఆటో బయోగ్రఫీ టైపు సినిమా. 

ఈ సినిమా నుంచి తొలి స్టిల్ బయటకు వచ్చింది. ఐశ్వర్య రాజేష్ తో విజయ్ దేవరకొండ రొమాంటిక్ టచ్ వున్న స్టిల్ బయటకు వదిలారు. ఇది చూస్తుంటే గీతగోవిందం గుర్తుకు వస్తోంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం టీజర్ కోసం ప్రత్యేకంగా షూట్ చేసి వదిలారు అప్పట్లో. హీరోయిన్ రష్మికతో విజయ్ రొమాంటిక్ మూవ్ మెంట్స్.

ఇప్పుడు మళ్లీ విజయ్ తనకు ఏవి సెట్ అవుతాయో తెలుసుకున్నట్లుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లే తనకు అచ్చివచ్చే జోనర్లు అని గ్రహించినట్లుంది. ఇంకా మరో ముగ్గురు హీరోయిన్లతో విజయ్ స్టిల్స్ వరుసగా బయటకు రానున్నాయి. ఇవి కూడా వచ్చేస్తే, విజయ్ పక్కాగా ఏ టైపు సినిమా అందించబోతున్నాడో తెలిసిపోతుంది.

Show comments