గల్లీబాయ్.. తేజూ మళ్లీ చేతులు కాల్చుకుంటాడేమో!

కెరీర్ లో ఇప్పటివరకు రీమేక్ సబ్జెక్ట్ చేయలేదు సాయిధరమ్ తేజ్. తొలిసారి అతడికి గల్లీబాయ్ రూపంలో ఓ రీమేక్ ఆఫర్ వచ్చింది. అది కూడా గీతాఆర్ట్స్ బ్యానర్ లో. ఇంకేముంది ఎగిరి గంతేయొచ్చు. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న విజయాన్ని అందుకోవచ్చు. కానీ ఇక్కడే తేజూను హెచ్చరిస్తున్నారు అతడి సన్నిహితులు.

గల్లీ బాయ్ అనేది ఆకాశం నుంచి ఊడొచ్చిన సబ్జెక్ట్ కాదు. ఓ సాదాసీదా కథ. ఇంకా చెప్పాలంటే హిందీలోనే కాదు, తెలుగులో కూడా ఈ ప్లాట్ తో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఆ సినిమా ఎందుకు హిట్ అయిందంటే దానికి కారణాలు రెండే. ఒకటి సినిమాలో భావోద్వేగాలు అద్భుతంగా పండాయి. ఇక రెండోది ఆ ఎమోషన్స్ ను హీరో రణ్వీర్ సింగ్ అంతే అద్భుతంగా పండించాడు.

రీమేక్ కు వచ్చేసరికి ఈ రెండు ఎలిమెంట్స్ అలానే క్యారీ అవుతాయనే గ్యారెంటీ అస్సలు లేదు. మాతృకలో ఉన్న ఎమోషన్ ను రీమేక్ లో చూపించలేక చతికిలపడిన సినిమాలు కోకొల్లలు. అంతెందుకు కేవలం ఎమోషన్ పండలేదనే కారణంతోనే తమిళనాట అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కుతున్న వర్మ సినిమాను పూర్తిగా పక్కనపెట్టేసి, మళ్లీ ఫ్రెష్ గా షూటింగ్ స్టార్ట్ చేశారు. సో.. గల్లీ బాయ్ తెలుగు రీమేక్ కు అదొక ప్రమాదం ఉండనే ఉంది.

ఇక యాక్టింగ్ విషయానికొద్దాం. రణ్వీర్ సింగ్ రేంజ్ లో సాయిధరమ్ తేజ్ నటించగలడా అనేది కూడా మరో కోణం. ప్రతి సినిమాకు రణ్వీర్ సింగ్ తన యాక్టింగ్ టాలెంట్ ను మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. నిజానికి అతడు అలాంటి పాత్రలు ఎంపిక చేసుకున్నాడు. తేజూ విషయానికొచ్చేసరికి అది కనిపించడం లేదు. అతడి టాలెంట్ ను ఎలివేట్ చేసేలా ఒక్క సినిమా లేదు. మరీ ముఖ్యంగా అతడు అద్భుతంగా పండించిన సీన్ కూడా లేదు.

సో.. గల్లీబాయ్ సినిమాను రీమేక్ చేసేందుకు ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. జోయా అక్తర్ రేంజ్ లో భావోద్వేగాలు పండించే దర్శకుడితో పాటు.. రణ్వీర్ రేంజ్ లో నటించే నటుడు కూడా కావాలి.

అనంతపురం అర్బన్..వైసీపీలో మళ్లీ పాత గొడవే?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?