గాజువాకలోనూ పవన్ కల్యాణ్ డౌటేనా?

ఈ సందేహాన్నే కలిగిస్తోంది తెలుగుదేశం అనుకూల పత్రిక ఒకటి. ఏ నియోజకవర్గం  మీద ప్రత్యేకంగా విశ్లేషణ రాయని ఒక తెలుగు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీ.. గాజువాక లో పవన్ కల్యాణ్ విజయం పట్ల సందేహం వ్యక్తంచేసింది! అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి  గట్టిపోటీ ఇచ్చిన వైనాన్ని ఆ పత్రిక వివరించింది. అయితే అది తనదైన రాతలు రాసింది.

తిప్పారెడ్డి సానుభూతిలో ఓట్లు అడిగారని, ఈసారి ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలన్నట్టుగా ఆయన ప్రచారం చేశారని, వచ్చేసారి పోటీచేసేది ఉండదంటూ ఆయన ప్రచారం చేసుకున్నారని.. ఆ ప్రభావం ఉంటుందన్నట్టుగా ఆ పత్రిక రాసింది. అయిన ఒక పార్టీ అధినేత, పవర్ స్టార్ పోటీచేస్తుంటే.. ఒక వృద్ధుడు తనకు చివరిసారి అవకాశం ఇవ్వాలని సానుభూతితో అడిగితే జనాలు ఓట్లేస్తారా?

పవన్ కల్యాణ్ ఓటమి అనే భయంతో ఇలాంటి కథనాలను ఇప్పుడే అల్లుతున్నారనే భావన వ్యక్తం అవుతోంది విశ్లేషకుల నుంచి. ఇక అదే నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాగా ప్రలోభాలకు గురి చేసిందని ఆ పత్రిక రాసుకురావడం మరో విడ్డూరం!

ప్రలోభాల విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లతో పోటీపడే స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదనేది అందరూ ఎరిగిన సత్యం. అయినా పోలింగ్ అయిపోయాకా కూడా.. ఇలా వైఎస్సార్సీపీ మీద బురద జల్లుతూ ఉండటం పచ్చ పైత్యమే అని చెప్పాలి.

ఇక ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా పోటీఇస్తూ ఉన్నాడంటూ.. ఆఖర్లో ఒక వాక్యాన్ని జతచేశారు. తెలుగుదేశం అభ్యర్థి కోసం చంద్రబాబు నాయుడే ప్రచారానికి రాలేదు. పార్టనర్ పవన్ కల్యాణ్ కు బాబు అలా సహకరించారని స్పష్టం అవుతోంది. 

స్థూలంగా గాజువాకలో పవన్ కల్యాణ్ ఓడినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే భావనతోనే తెలుగుదేశం అనుకూల మీడియా ఇప్పటి నుంచినే కథలు అల్లుతోందనే క్లారిటీ మాత్రం వస్తోంది!

Show comments