ఒక అర్జున్ రెడ్డి.. ఒక రంగస్థలం.. ఒక మను

మను సినిమా యూనిట్ నమ్మకం ఈ విధంగా ఉంది. అర్జున్ రెడ్డి, రంగస్థలం సినిమాలు ఎలాగైతే హిట్ అయ్యాయో.. మను సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు వీళ్లు. అయితే ఇక్కడ కేవలం అర్జున్ రెడ్డి, రంగస్థలం సినిమాలతోనే వీళ్లు లింక్ పెట్టుకోవడానికి ఓ రీజన్ ఉందిక్కడ.

మను సినిమా చిన్న సినిమా కాదు. ఏకంగా 3 గంటల నిడివి ఉన్న సినిమా. ఎలాంటి స్టార్ ఎట్రాక్షన్ లేకుండా ఇంత నిడివి ఉన్న సినిమాను భరించగలమా అనే ప్రశ్నకు సమాధానంగా మేకర్స్ అర్జున్ రెడ్డిని చూపిస్తున్నారు. ఎలాంటి అంచనాల్లేకుండా 3 గంటలకు పైగా నిడివితో వచ్చిన అర్జున్ రెడ్డి హిట్టయింది కాబట్టి, మను కూడా సక్సెస్ అవుతుందనేది వీళ్ల వాదన.

లాజిక్ అయితే బాగుంది కానీ కంటెంట్ ఏంటనేది అందరికీ డౌట్. న్యూ ఏజ్ ఆఫ్ ఫిలిం మేకింగ్, టెక్నికల్ బ్రిలియన్స్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇవన్నీ కంటెంట్ బాగుంటేనే. కంటెంట్ ఏమాత్రం తేడా కొట్టినా 3 గంటల వినోదం అనే విషయాన్ని పక్కనపెడితే, 3 గంటల విసుగు మాత్రం గ్యారెంటీ. 

మరోవైపు ఇప్పటికే ఈ మూవీని ప్రివ్యూల రూపంలో చూసిన సినీజనాలు వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం, మను సినిమా రెవెంజ్ డ్రామా అని తెలుస్తోంది. మూవీ మొత్తంలో 45 నిమిషాలు ఎలాంటి డైలాగులు ఉండవట. కేవలం సౌండ్ ఎఫెక్టులే. వంద మందికి పైగా వ్యక్తులు డబ్బులు పోగేసుకొని తీసిన ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది.

RELATED తప్పదు.. హరీష్‌రావుకి వేరే ఛాన్స్‌ లేదు.!