డిప్రెషన్ లో క్రిష్: అసలెందుకు గాడి తప్పాడు?

వందలకొద్దీ హిట్ సినిమాలతో నిర్మాతలకు కాసులవర్షం కురిపించిన మహానటుడు ఎన్టీఆర్.. చివరకు తన బయోపిక్ ద్వారా నిర్మాతలకు నష్టాలు మిగిల్చిన పరిస్థితి. పోనీ పార్ట్ 1 తోనే ఈ దరిద్రం పోతుందనుకుంటే.. పార్ట్ 2 ట్రైలర్ విడుదల రోజే సినిమా రిజల్ట్ ని చెప్పకనే చెప్పింది. మహానాయకుడు టేకింగ్ దారుణంగా ఉందని చెప్పడానికి ట్రైలర్ ప్రత్యక్ష నిదర్శనం.

ఎన్టీఆర్ బయోపిక్ చూస్తే, క్రిష్ దర్శకత్వం ఇలా కూడా ఉంటుందా అనిపించక మానదు. తక్కువ సినిమాలతోనే సంచలన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న క్రిష్.. బయోపిక్ పుణ్యమా అని పూర్తిగా దారితప్పాడు. కంగనా వివాదంతో బాలీవుడ్ లో కూడా క్రిష్ ఇమేజీకి డ్యామేజీ జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో ఒక్కరంటే ఒక్కరు కూడా క్రిష్ కి మద్దతుగా మాట్లాడలేదు. దీంతో క్రిష్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని తెలుస్తోంది.

ఆ ఎఫెక్ట్ మహానాయకుడు బ్యాలెన్స్ పార్ట్ పై బాగాపడింది. ట్రైలర్ కట్ చూస్తునే క్రిష్ రెండో భాగంపై అసలు ఏమాత్రం మనసు పెట్టలేదని అర్థమవుతోంది. ఇక సినిమా చూస్తే అసలు క్రిష్ ఎంతవరకు పనిచేశాడు, ఆయన పేరు చెప్పుకుని ఇంకెవరైనా సినిమాని చుట్టేశారా అనే విషయం తెలుస్తుంది.

ప్రేక్షకులను ఆలోచింపచేస్తూ, సందేశాన్నిస్తూనే ఎంటర్టైన్ మెంట్ మిస్ కాని సినిమాలు తీసే అతికొద్దిమంది తెలుగు దర్శకుల్లో క్రిష్ ఒకడు. గమ్యం నుంచి కంచె వరకు క్రిష్ తీసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. గౌతమీపుత్ర శాతకర్ణి మరో ఎత్తు. అతడి ఇమేజ్ ను మరింత పెంచింది ఆ సినిమా.

ఆ తర్వాత మణికర్నిక అంటూ మరో వీరోచిత గాథను హిందీలో మొదలు పెట్టాడు. మధ్యలో ఎన్టీఆర్ బంపర్ ఆఫర్ తగిలే సరికి హిందీ సినిమా నుంచి  తప్పుకున్నాడు. అక్కడే క్రిష్ దారితప్పాడు. అటు మణికర్నిక సినిమాకు న్యాయం చేయక, ఇటు ఎన్టీఆర్ ని సరిగా ప్లాన్ చేసుకోక తన ఇమేజ్ ని పణంగా పెట్టాడు.

రాజకీయ శక్తులు చేతులు కట్టేశాయో లేక, బాలకృష్ణ ప్రోద్బలం బాగా పనిచేసిందో తెలియదు కాని, ఎన్టీఆర్ బయోపిక్ ఎటూ కాకుండా తేలిపోయింది. 

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!