అక్కడ కాంగ్రెస్ కి పట్టిన గతి.. ఇక్కడ టీడీపీకి!

తెలంగాణలో ప్రతిపక్షం పాత్ర నామమాత్రమే. గెలిచినోళ్లంతా పొలోమంటూ టీఆర్ఎస్ పంచన చేరిపోతున్నారు. కాంగ్రెస్ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి. రాబోయే రోజుల్లో ఏపీలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశముంది. అక్కడ కాంగ్రెస్ ఖాళీ అయితే ఇక్కడ టీడీపీ నేతలు తట్టాబుట్టా సర్దేసుకోడానికి సిద్ధంగా ఉన్నారు.

అధికారం లేకపోయినా, అధికార పక్షం ప్రలోభాల వల విసిరినా, వేధింపులకు గురిచేసినా.. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆనాడు నాయకుడినే అంటిపెట్టుకుని ఉన్నారు. డబ్బు సంచులకు అమ్ముడుపోయిన వాళ్లు కూడా చివరి దశలో జగన్ వైపు వచ్చారంటే.. పచ్చ పార్టీ, ఆ పార్టీ నాయకుడి వ్యవహారశైలి అర్థం చేసుకోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు వైపు ఉన్నారే కానీ, మిగతా వాళ్లు కూడా ఎప్పుడెప్పుడు ఆ చెర నుంచి బైటపడదామా అని ఆలోచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే అదే జరుగుతుంది.

ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకపోయినా పర్లేదు, పార్టీలో చేర్చుకుంటాననే ఆఫర్ జగన్ ఇస్తే.. టీడీపీ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నారా, నందమూరి ఫ్యామిలీలు తప్ప మిగతావారంతా వైసీపీలో చేరడం ఖాయం. ఎన్నికల ముందే చాలామంది టీడీపీ నాయకులకు తత్వం బోధఫడింది. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో వారంతా ఎన్నికలు ఎదుర్కొన్నారు. పోలింగ్ పూర్తయ్యాక చంద్రబాబు సహా దాదాపుగా అందరూ ఓ అంచనాకి వచ్చేశారు.

చంద్రబాబు ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై పడి ఏడుస్తున్నారు. మరి మిగతావాళ్ల సంగతేంటి. చంద్రబాబు ఎలాంటి వాడో తెలుసు కాబట్టి.. ఐదేళ్లు పార్టీని అంటిపెట్టుకుని ఉండే ఉద్దేశం వీరికి లేదు. బాబు నమ్మిన వారిని నట్టేట ముంచేరకం కాబట్టి.. నేతలంతా ముందు జాగ్రత్త పడుతున్నారు. మూకుమ్మడిగా పార్టీ మారేందుకు రహస్య మంతనాలు జరుపుతున్నారట.

కానీ చంద్రబాబు చేసిన దుష్ట రాజకీయాన్ని జగన్ చేయరు. ఈ విషయాన్ని ఇప్పటికే వైసీపీ పదేపదే గుర్తుచేస్తోంది. వలసల్ని ఎన్నికలకు ముందు కూడా వ్యతిరేకించిన వైసీపీ, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలనుకుంటోంది. గత ఎన్నికల తర్వాత వైసీపీ ఎమ్మెల్యేల్ని సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేసిన చంద్రబాబు తీవ్ర విమర్శల పాలయ్యారు. ప్రజల దృష్టిలో చులకన అయ్యారు. వైసీపీ అలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండబోతోంది.

పవన్ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్లు?