చంద్రబాబుకు మాజీ సీఈసీ పవర్ పంచ్!

ఈవీఎంల విషయంలో ఇప్పుడే లేచి వచ్చి కొత్త కొత్త అభ్యంతరాలు చెబుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ పవర్ పంచ్ ఇచ్చారు. బీజేపీతో కలిసి ఉన్నన్ని రోజులూ ఈవీఎంల మీద అభ్యంతరం చెప్పని చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెబుతున్న అభ్యంతరాల విషయంలో సంపత్ ఫైర్ అయ్యారు. 'ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా ఇలా మాట్లాడటం రాజకీయ నేతలకు అలవాటు అయిపోయింది..'అని సంపత్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు ఇంకా ఎన్నికల్లో ఓడిపోలేదనుకోండి. ఓటమికి రీజన్ గా చెప్పడానికే ఆయన ఈవీఎంల మీద మాట్లాడుతున్నారనేది చాలామంది అనుకుంటున్న విషయం. చంద్రబాబు నాయుడు చేస్తున్న డిమాండ్లు అర్థం లేనివి అని సంపత్ అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలకు రెండేళ్ల కిందటే రాజకీయ పార్టీలన్నింటినీ పిలిచి.. ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహించే విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయాలను కోరగా.. దాదాపు అన్నిపార్టీలూ అందుకు సమ్మతం తెలియజేశాయని సంపత్ అన్నారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

బ్యాలెట్ ద్వారా ఎన్నికలు వద్దని అప్పుడు మెజారిటీ పార్టీలు అన్నాయని, ఇప్పుడు మాత్రం గగ్గోలు పెట్టడం ఏమిటని ఆయన వ్యాఖ్యానించారు. 'చంద్రబాబు నాయుడు చెబుతున్నట్టుగా యాభైశాతం వీవీ ప్యాట్లు లెక్కించడానికి బదులుగా బ్యాలెట్ పేపర్ల మీదే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు..' అని కూడా సంపత్ వ్యాఖ్యానించారు. వీవీ ప్యాట్ ల విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పును కూడా ఇచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ర్యాండమ్ గా ఐదు వీవీ ప్యాట్లను లెక్కించి, ఈవీఎం మిషన్ నంబర్ తో పోల్చి చూసుకోవాలని కోర్టు ఆదేశించింది.

ర్యాండమ్ గా ఎంచుకోవడం ద్వారా అసలు విషయాలు బయటపడిపోతాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు అయ్యాకా కూడా చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యానానికి తను కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి నేఫథ్యంలో ఈ మాజీ సీఈసీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ఇప్పుడు పోయిన ప్రాణాలను జేసీ సోదరులు తెచ్చిస్తారా?