నాని వైజాగ్ సెంటిమెంట్

గ్యాంగ్ లీడర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ విశాఖపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా వైజాగ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు నాని. తన కెరీర్ కు విశాఖకు చాలా దగ్గర సంబంధం ఉందంటూ ఓ సెంటిమెంట్ ను బయటపెట్టాడు. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.

"ఎప్పుడో పదేళ్ల కిందట వైజాగ్ అమ్మాయితో లవ్ లో పడ్డాను. అప్పట్నుంచి ఇప్పటివరకు ఈ సిటీతో లవ్ లోనే ఉన్నాను. అష్టాచమ్మాకు 3 రోజుల ముందు వైజాగ్ లో స్పెషల్ ప్రీమియర్ జరిగింది. అలా నా కెరీర్ వైజాగ్ లో స్టార్ట్ అయింది. 11 ఏళ్లు గడిచిపోయాయి. అలా అయిపోయాయి. మళ్లీ గ్యాంగ్ లీడర్ కు 3 రోజుల ముందు ఇక్కడ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మరో 11 సంవత్సరాలు సేఫ్."

ఇలా విశాఖతో తనకున్న సెంటిమెంట్ ను బయటపెట్టాడు నాని. సినిమావాళ్లంతా పాటల కోసం దేశాలు పట్టుకొని తిరుగుతుంటారని, వైజాగ్ కు మంచిన అందమైన లొకేషన్ ప్రపంచంలో ఎక్కడా లేదంటున్నాడు నాని. గ్యాంగ్ లీడర్ ను కేవలం తన సినిమాగా కాకుండా టెక్నికల్ సినిమాగా చెప్పుకొచ్చాడు.

"విక్రమ్ కుమార్ సినిమా ఇది. అతడి టేకింగ్ చాలా బాగుంటుంది. గ్యాంగ్ లీడర్ లో ఇంకా ఎక్కువ చూస్తారు. ఇక అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. మూవీలో చాలా చోట్ల అనిరుధ్ మ్యూజిక్ వినిపించడమే కాదు, అతడ్ని మీరు గుర్తుచేసుకుంటారు కూడా."

గ్యాంగ్ లీడర్ సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. జెర్సీ తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాతో ప్రియాంక హీరోయిన్ గా పరిచయమౌతోంది. 

గ్యాంగ్ లీడర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

 

Related Stories: