విశాఖ తూర్పు వైసీపీలో భారీమార్పు..!

విశాఖ తూర్పు సీటు టీడీపీకి కంచుకోటలా ఉంది. ఇక్కడ గత రెండుసార్లుగా వెలగపూడి రామక్రిష్ణ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో ధీటైన పోటీ ఇస్తారనుకున్న వైసీపీలో సడెన్ గా చేసినమార్పు ఇపుడు ఆసక్తికరంగా మారింది.

ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన వంశీక్రిష్ణ యాదవ్ కి చివరి నిముషంలో హైకమాండ్ టికెట్ నిరాకరించింది. దాంతో  వంశీ అభిమానులు చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఏకంగా వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణ ఆఫీస్ కి వెళ్ళి మొత్తం ఫర్నిచర్ ద్వంసం చేశారు. రోడ్దిక్కి రచ్చచేశారు.

ఇక అక్కడ వైసీపీనేత వంశీ పార్టీ మారాలనుకుంటున్నట్లుగా కూడా భోగట్టా. జనసేన, టీడీపీని టచ్ లో పెట్టుకున్నారని టాక్. నిజానికి ఇక్కడ వంశీకి నచ్చచెప్పడంలో లోకల్ నాయకులు విఫలమయారని అంటున్నారు. ఈ పరిణామాన్ని క్యాష్ చేసుకోవడానికి టీడీపీ రెడీగా ఉంది.

ఇక్కడ నుంచి వైసీపీ కొత్త అభ్యర్ధిగా అక్రమాని విజయనిర్మలకు టికెట్ ఇచ్చారు. ఆమె నిన్నటివరకూ భీమిలీ ఇంచార్జి. అక్కడ అవంతి శ్రీనివాసరావుకి టికెట్ ఇవ్వడంతో ఆ వర్గం దూరంగా ఉంది. దాంతో తన గెలుపు కోసం అవంతి శ్రీనివాసరావు చేసిన లాబీయింగ్ ఫలితం ఆమెకు విశాఖ తూర్పు టికెట్ దక్కింది. అయితే  ఇక్కడ వంశీని తప్పించడంతో పార్టీలో పెద్ద గందరగోళమే రేగుతోంది.

సీనియర్ నేతగా ఉన్న వంశీ వైసీపీ నగర అధ్యక్షునిగా కూడా పనిచేశారు. ఆయనకు పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చెబుతున్నా శాంతించేలా లేరు. వంశీ కనుక పార్టీని వీడితే ఇక్కడ వైసీపీకి గడ్డు పరిస్థితేనని అంటున్నారు. ఇక్కడ యాదవ సమాజం పెద్దసంఖ్యలో ఉన్న కూడా అక్రమాని విజయనిర్మల బ్రాహ్మిన్ కావడం వల్ల వారు పనిచేసే పరిస్థితి లేదంటున్నారు.

అదే సమయంలో ఆమె భర్త యాదవ సామాజికవర్గం కావడం ఏమైనా ఉపయోపడుతుందేనని వైసీపీ ఇక్కడకు డంప్ చేసింది. మొత్తానికి విశాఖ తూర్పులో హఠాత్తుగా జరిగిన ఈ మార్పుతో ఆ పార్టీ అభిమానులు ఖంగు తింటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

కర్నూలు ఎంపీ సీటు YCPకి ఇబ్బందులు తప్పవు

సావిత్రి, క్రీడాకారుల సినిమా చూశారే! మరి ఎన్టీఆర్ దే ఎందుకిలా?

Show comments