విశాఖ ఇక నందనవనమే

విశాఖ ఒకపుడు చిన్న గ్రామంగా ఉండేది.  ఆ తరువాత దాని ఎదుగుదల మొదలైంది. ఎదుగుదలతో పాటే ఇబ్బందులూ వచ్చాయి. ఒకపుడు  పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, సమ శీతోష్ణ స్థితి కలిగిన వాతావరణంలో ఆంధ్రా ఊటీగా ఉండేది.

రాను రానూ అభివ్రుధ్ధి మాటున నగరం కాలుష్య కోరల్లోకి వెళ్లిపోయింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పాటుగా విశాఖ కూడా ఆక్సిజన్ శాతం తక్కువగా నమోదు అయ్యే సిటీగా ముద్ర పడుతోంది. దీనికంతటికీ కారణం పచ్చదనం లేకపోవడమే.

ఇక విశాఖను పాలనారాజధాని చేయాలనుకుంటున్న వైసీపీ సర్కార్ ఈ నగరాన్ని పచ్చగా పదికాలాలు ఉంచాలనుకుంటోంది, అందులో  భాగంగా నౌపాక జాతి మొక్కలను విశాఖ అంతటా నాటేందుకు రంగం సిధ్ధం చేశారు. ఇవి ఔషధ మొక్కలు, కేవలం అందంగా కనిపించడానికే కాదు, పూర్తి  ఆరోగ్యాన్నీ ఇచ్చే మొక్కలు.

వీటితో పాటు అనేక ఇతర జాతుల మొక్కలను తెచ్చి విశాఖ నిండా నాటేందుకు వైసీపీ సర్కార్ రంగం సిధ్ధం చేసింది. దాదాపుగా రెండు కోట్ల మొక్కలంతో విశాఖ నగరం ఇక నందనవనం కానుంది. ఇక క్లీన్ విశాఖ గ్రీన్ విశాఖగా కొత్త రాజసం సంతరించుకోనుంది. మొత్తానికి పర్యాటకులకు కనువిందు చేయడానికి విశాఖ ఎవెర్ గ్రీన్ బ్యూటీగా మారుతోందన్నమాట.

చంద్రబాబు కలల్లోకొచ్చి భయపెడుతున్నాడు

Show comments