వినాయక్ సీనయ్య వచ్చేసాడు

వివి వినాయక్. టాలీవుడ్ లో హీరోల ఎలివేషన్ సీన్లు అయినా, అసలు కమర్షియల్ ఎలివేషన్ సీన్లు అయినా, ఇలా వుండాలని చేసి చూపించిన డైరక్టర్. పక్కా అల్టిమేట్ మాస్ సినిమాలు తీసి, బ్లాక్ బస్టర్లు చేసిన డైరక్టర్. ఇప్పుడు తొలిసారి ఫుల్ లెంగ్త్ పాత్ర వేస్తూ సినిమా చేస్తున్నాడు. గతంలో ఒకటి రెండుసార్లు సరదగా తన సినిమాల్లో కెమేరా ముందు కనిపించిన వినాయక్ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు.

గతంలో ఒకటి రెండు సినిమాలు చేసిన నరసింహారావు తయారు చేసి ఎమోషనల్ కథను అందించడంతో వివి వినాయక్ ఓకె చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును నిర్మాతను చేసింది వినాయక్ నే. ఇప్పుడు అదే వినాయక్ ను హీరోను చేస్తున్నది దిల్ రాజే.

మెకానిక్ గ్యారేజ్ ఓనర్ సీనయ్యగా కనిపిస్తాడు వినాయక్ ఈ సినిమాలో. పూర్తిగా ఎమోషనల్ గా నడిస్తే కథతో సినిమాను రూపొందిస్తున్నారు. బుధవారం (9న) ఉదయం అల్లు అరవింద్, రాఘవేంద్రరావు లాంటి వాళ్ల సమక్షంలో ఈ సినిమాను ప్రారంభిస్తున్నారు.

ఈ సినిమా ఓపెనింగ్, ఇంకా వినాయక్ బర్త్ డే సందర్భంగా ఆయన స్వంత ప్రాంతమైన చాగల్లు నుంచి రెండు మూడు వందల మంది ప్రత్యేకంగా ఇక్కడకు వస్తుండడం విశేషం.

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం