వినయ విధేయ.. ఇంకో షెడ్యూలు

వినయ విధేయ రామ.. బోయపాటి-రామ్ చరణ్ ల సినిమా. ఈ సినిమా అలా అలా షూటింగ్ సా...గు...తూనే వుంది. అసలే బోయపాటి భారీ సినిమా. దీనికితోడు రామ్ చరణ్ సెలవు చీటీలు. ఈ సినిమా షూటింగ్ డేస్ క్యాన్సిల్ చేసినవి ఇన్నీ అన్నీ కావని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. రాత్రి అప్పటికప్పుడు, మార్నింగ్ 10గంటలకు ఫోన్ చేసి, షూటింగ్ క్యాన్సిల్ చేయించిన రోజులు బోలెడు అని టాక్.

బోయపాటి ఓ దశలో రామ్ చరణ్ ఈ సెలవు ఫోన్ లతో ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు వున్నాయని, యూనిట్ వర్గాల బోగట్టా. మొత్తంమీద అలాగే నెట్టుకు వస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా వైజాగ్ షెడ్యూలు స్టార్ట్ చేసారు. 

పోనీ ఈ షెడ్యూలుతో అయిపోతుందా అంటే లేదట.. ఇంకా మరో చిన్న షెడ్యూలు కూడా వుంటుందని తెలుస్తోంది. వర్కింగ్ డేస్ తక్కువే కావచ్చు కానీ, హీరో సడెన్ ఆబ్సెంట్ ల ఫుణ్యమా అని సినిమా అలా సాగుతోంది.

ఎలాగూ జనవరి విడుదల కాబట్టి టెన్షన్ అయితే లేదు. కానీ బోయపాటి మాత్రం లోలోపల చాలా ఇబ్బంది పడుతున్నట్లు సన్నిహితుల బోగట్టా.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

 

Show comments