విలన్ గా నాని

హీరోలు ఇప్పుడు కొత్త కొత్త కథలను, కాన్సెప్ట్ లను ఎంచుకుంటున్నారు. కొత్త పుంతలు తొక్కుతున్నారు. హీరో నాని ఇలాంటి విషయాల్లో అందరికన్నా కాస్త ముందు వుంటారు. గతంలో ఇంద్రగంటి డైరక్షన్ జెంటిల్ మన్ సినిమాలో రెండు షేడ్స్ వున్న పాత్రలు చేసి చూపించాడు. ఎన్టీఆర్ కూడా జై లవకుశ సినిమాలో నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ చేసాడు. ఇప్పుడు మళ్లీ నాని మరోసారి అదే ఇంద్రగంటితో ఓ డిఫరెంట్ సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాలో నాని విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాలో మరో హీరోగా సుధీర్ బాబు నటిస్తాడు. సుధీర్ బాబు పోలీస్ ఇన్ స్పెక్టర్ గా, నాని విలన్ గా వుండే అవకాశం వుంది. అయితే ఎవరి పాత్ర ఎంత వుంటుంది అన్నది తెలియలేదు.

ఈ ప్రాజెక్టు ఇన్నాళ్లు వార్తల్లో వుండి, ఇప్పుడే ఫైనల్ అయింది. కొద్దిరోజుల్లో ప్రకటన బయటకు వస్తుంది. నాని మాంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్. అందులో సందేహం లేదు. అందువల్ల విలన్ గా కచ్చితంగా మాంచి పెర్ ఫార్మెన్స్ ఇస్తాడనే అనుకోవాలి.

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

Show comments