ఇదీ చంద్రబాబు దేవుడి అసలైన స్క్రిప్ట్!

'కరకట్ట మీద మీ అక్రమ నివాసం మునిగిపోవడం, తమరు హైదరాబాద్ కు పలాయనం చిత్తగించడం.. ఇదీ దేవుడి అసలైన స్క్రిప్ట్'' అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్లపై ట్విటర్ ద్వారానే సమాధానం ఇచ్చారు విజయసాయి రెడ్డి. ఆ ట్వీట్ల వరస ఇలా ఉంది..

''భ్రమరావతి అనే ‘ప్రపంచ నంబర్ వన్’ రాజధానిలో ఉన్న నాలుగు భవనాలకు స్వాతంత్ర దినోత్సవం రోజు లైటింగ్ ఏర్పాటు చేస్తే ఇంతగా మురిసిపోవడం ఏమిటి బాబు గారూ? కరకట్ట అక్రమ నివాసం మునిగిపోవడం, తమరు హైదరాబాద్ పలాయనం చిత్తగించడం. దేవుడు రాసిన అసలు స్క్రిప్ట్.

అన్నక్యాంటీన్ల బకాయిలు వంద కోట్లు మీరు దోచుకున్న సొమ్ము నుంచి చెల్లిస్తే ఇప్పుడే తెరుచుకుంటాయి. రెండు లక్షలు ఖర్చయ్యే షెడ్డుకు 30-40 లక్షలు దండుకున్నారు. ఆ డబ్బును తిరిగిచ్చినా ఐదేళ్లపాటు నడుస్తాయి. కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తే ప్రయోజనం ఏమీ ఉండదు.

మాజీలైన మంత్రులు కొందరు బాబు అక్రమ కొంపకు వాచ్మన్లలాగా కాపలా కాయడం ఏమిటి? కర్మ కాకపోతే. ముంపు ప్రాంతాలను డ్రోన్లతో ఎలా చిత్రీకరిస్తారని మీడియాను దబాయిస్తున్నారు. లింగమనేని ఇంటి గురించి ఆందోళన మానేసి లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయపడండి బాబూ.

లోకేశ్ ‘పెద్ద మనిషయ్యాక’ ఇంత పెద్ద వరదను చూసి ఉండడు. వానలు లేకున్నా7 లక్షల క్యూసెక్కులు ఎలా వస్తున్నాయో అంతుబట్టడం లేదతనికి. వరదలో కొట్టుకొచ్చిన పడవను చూసి కావాలనే ఎవరో నెట్టారని అపోహ పడుతున్నాడు. ఇరిగేషన్ వారితో కౌన్సిలింగ్ ఇప్పించండయ్యా. బేసిక్ నాలెడ్జన్నా పెరుగుతుంది.'' అంటూ విజయసాయి రెడ్డి స్పందించారు.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?