మెగాహీరో సినిమాలో విలన్ గా విజయ్

కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న విజయ్ సేతుపతి, టాలీవుడ్ లో కూడా అదే మార్క్ కొనసాగిస్తున్నాడు. క్యారెక్టర్ కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తున్న విజయ్ సేతుపతి, ఇప్పుడు మరో మెగా హీరో సినిమాకు కమిట్ అయ్యాడు.

మెగా కాంపౌండ్ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమౌతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఈ ప్రాజెక్టులో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నారు. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుంది.

ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాను పూర్తిగా స్టోరీ బేస్డ్ గా తీస్తున్నారు. అంటే హీరో, విలన్ అనే మీటర్స్ పెట్టుకోలేదు. కథ ప్రకారం స్క్రీన్ ప్లే వెళ్లిపోతుందట. అలా చూసుకుంటే హీరో కంటే నెగెటివ్ షేడ్స్ లో ఉన్న విజయ్ సేతుపతి పాత్రకే ఎక్కువ స్కోప్ ఉంటుందట. విజయ్ ఈ పాత్ర ఒప్పుకోవడానికి కూడా కారణం ఇదే.

సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై తెరకెక్కుతోంది ఈ సినిమా. మత్స్యకారుల కుటుంబానికి చెందిన కుర్రాడిగా వైష్ణవ్ తేజ్ ఇందులో కనిపించబోతున్నాడు. రంగస్థలం టైపులో పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది ఇది. 

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

Show comments