విజయ్ మీద అర్జున్ ముద్ర

అర్జున్ రెడ్డి, తెలుగు సినిమాల్లో ఓ సంచలనం. ఆ సినిమా ప్రారంభంలో దానిపై ఎవరికీ ఏ అంచనా లేదు. ఎర్రటి పెద్ద అక్షరాలు, రెండు వరసల్లో పేర్చి లోగో విడుదల చేస్తే ఏదో చిన్న సినిమా అనుకున్నారు. తరువాత తరువాత దాని సంగతి తెలిసింది. విడుదలయ్యాక దాని స్టామినా తెలిసింది. అదే సినిమాను హిందీలో తీస్తున్నపుడు కబీర్ సింగ్ అని టైటిల్ మార్చినా, లోగో మోడల్ మాత్రం మార్చలేదు.

లేటెస్ట్ గా విజయ్ మరో సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ లోగో బయటకు వచ్చింది. దీనిపై కూడా అర్జున్ రెడ్డి ప్రభావం వున్నట్లు కనిపిస్తోంది. వరల్డ్ అన్నది ఓ లైన్, ఫేమస్ అన్నది మరో లైన్. పైగా రెండు బోల్డ్ గా బిగ్ సైజ్ లెటర్స్. అర్జున్ రెడ్డి లోగోకి దీనికి ఏమిటి తేడా అంటే, అక్కడ రెడ్ లెటర్స్, ఇక్కడ బ్లాక్ లెటర్స్.

ఈ రెండు లైన్ల బ్లాక్ లెటర్స్ కు మధ్యలోనే లవర్ అన్న సిగ్నేచర్ స్టయిల్ ను రెడ్ కలర్ లో వుంచారు. క్రాంతిమాధవ్ డైరక్షన్ లో కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు ఈ సినిమాను. నలుగురు కథానాయకలతో విజయ్ నటిస్తున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ టైటిల్ ను ఒకరోజు ముందుగా గ్రేట్ ఆంధ్ర ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే.

గ్రేట్ ఆంధ్ర ఈవారం స్పెషల్ బిగ్ స్టోరీ

Show comments