విజయ్‌ దేవరకొండని రౌండప్‌ చేసారు

స్టార్‌ డైరెక్టర్లు సూపర్‌స్టార్‌ హీరోలతో బిజీగా వుండడంతో మీడియం రేంజ్‌ డైరెక్టర్లంతా విజయ్‌ దేవరకొండతో సినిమా చేసి స్టార్‌ స్టేటస్‌ తెచ్చుకోవాలని చూస్తున్నారు. యూత్‌ ఐకాన్‌గా మారిపోయిన విజయ్‌ దేవరకొండకి వున్న ఫాలోయింగ్‌కి అతనితో హిట్‌ కొట్టడం చాలా ఈజీ అని దర్శకులు భావిస్తున్నారు. అందుకే అతనికోసం క్యూ కడుతూ ఎలాగైనా ఓకే అనిపించుకోవాలని చూస్తున్నారు.

'గీత గోవిందం' తర్వాత విజయ్‌ దేవరకొండ ఇంతవరకు ఏ కొత్త సినిమా ఓకే చేయలేదు. దాదాపు అరడజను మంది నిర్మాతలతో అతనికి ఒప్పందాలున్నాయి. 'డియర్‌ కామ్రేడ్‌' మినహా ప్రస్తుతం ఏ సినిమాకీ సంతకం చేయలేదు.

విజయ్‌ దేవరకొండని మెప్పించడానికి మారుతి, గోపిచంద్‌ మలినేని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అలాగే పూరి జగన్నాథ్‌కి కూడా తనదైన శైలిలో ఒక పోకిరి లాంటి క్యారెక్టరైజేషన్‌తో విజయ్‌తో సినిమా చేయాలనే కోరిక వుందట.

కానీ విజయ్‌ దేవరకొండ ఏ దర్శకుడికీ అతని పూర్వ వైభవం లేదా సక్సెస్‌ చూసి డేట్స్‌ ఇవ్వడం లేదు. తన మార్కెట్‌ ఏమిటో విజయ్‌కి బాగా తెలుసు కనుక ఏ విధమైన ఛాన్స్‌ తీసుకోవడం లేదు. డజన్ల కొద్దీ కథలు వింటున్నా కానీ అతను ఎవరికీ ఓకే చెప్పట్లేదు. ప్రస్తుతం సూపర్‌స్టార్స్‌ కంటే విజయ్‌కే డిమాండ్‌ ఎక్కువ వుందంటే అతిశయోక్తి కాదు.

Show comments