విజిల్ వేయడానికి విజయ్ రెడీ

బిజిల్ (విజిల్) అనే పేరుతో సినిమా చేస్తున్నాడు తమిళ యంగ్ సూపర్ స్టార్ విజయ్. మాస్ డైరక్టర్ అట్లీ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాను తెలుగు హక్కుల కోసం ఇద్దరు ముగ్గురు రెడీ అయ్యారు. దాంతో రేటు కాస్త ఘాటుగా చెప్పారు. ఆఖరికి ఇప్పటికి సెటిల్ అయింది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మహేష్ కోనేరు ఈ సినిమా తెలుగు థియేటర్ హక్కులను, చిత్తూరు జిల్లాకు ప్రత్యేకంగా తమిళ వెర్షన్ థియేటర్ హక్కులను తీసుకున్నారు. తమిళ వెర్షన్ నిర్మాతలు ఆరంభంలో పదికోట్ల వరకు చెప్పారని తెలుస్తోంది. కెఎఫ్సీ, సుధాకర రెడ్డి ఇలా పలువురు ఆసక్తి చూపించినా, రేటు చూసి వెనక్కు వెళ్లారు.

ఆఖరికి ఇప్పుడు ఏడుకోట్ల దగ్గర సెటిల్ అయినట్లు తెలుస్తోంది. దీపావళికి ఈ సినిమాను విడుదల చేస్తారు. వెంకీ-నాగచైతన్యల వెంకీమామకు సోలో డేట్ అనుకుంటే, ఇప్పుడు ఈ విజిల్ పోటీకి రెడీ అవుతోంది. విజయ్ కు తెలుగులో కాస్త మార్కెట్ వుంది. సినిమా బాగుంటే పెద్ద మార్కెట్ నే వుంది.

ఇదిలావుంటే ఇదే డేట్ కు మరో తమిళ హీరో కార్తి సినిమా కూడా రెడీ అవుతోంది. అంటే వెంకీమామకు రెండు తమిళ సినిమాల నుంచి పోటీ ఎదురవుతోందన్నమాట.

అదొక్కటే.. జగన్ తప్పుడు నిర్ణయం

Related Stories: