పొలిటికల్ కామెడీః వేణుమాధవ్.. నామినేషన్ తిరస్కరణ!

సినిమాల్లో కమేడియన్ నిజ జీవితంలో ఏదో రాజకీయం చేయబోతే.. అది కూడా కామెడీనే అయ్యింది. ఉన్నట్టుండి కోదాడ నుంచి ఎమ్మెల్యే అయిపోవాలని నామినేషన్ వేస్తానని వేణుమాధవ్ ప్రకటించాడు. ప్రకటించినట్టుగానే ఈ రోజు నామినేషన్ పత్రాలను అధికారులకు ఇచ్చాడు. అయితే.. అవి సరిగ్గా లేవని.. అధికారులు వాటిని తిరిగి ఇచ్చేశారు. దీంతో పత్రాలను పట్టుకుని వెనుదిరిగాడు వేణుమాధవ్.

అన్ని పత్రాలనూ సమకూర్చుకుని శనివారం కానీ, సోమవారం కానీ మళ్లీ నామినేషన్ వేస్తానని వేణుమాధవ్ ప్రకటించాడు. ఇలా కామెడీగా సాగింది వేణుమాధవ్ నామినేషన్ అంకం. సాధారణంగా నామినేషన్ల రోజున అధికారులు పత్రాలను పెద్దగా పరిశీలించరు.

నామినేషన్ల పరిశీలన అనే అంకం వేరే ఉంటుంది. అప్పుడు అన్ని పత్రాలనూ చూసి.. కరెక్టుగా ఉన్నాయో లేదో గమనించి.. వాటిని ఓకే చేయడమా లేక నో చెప్పడమా... అనే విషయాన్ని తేల్చుతారు. అయితే వేణుమాధవ్ నామినేషన్ పత్రాల్లో మరీ బేసిక్ రూల్స్ ను కూడా ఫాలో అయినట్టుగా లేడు.

అందుకే.. అధికారులు వెంటనే వాటిని వెనక్కు ఇచ్చి పంపేశారు. మరి ఈ వీర తెలుగుదేశం భక్తుడు ఇలా ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగుతుంటే.. పచ్చ చొక్కాల వాళ్లు బుజ్జగించడం లేదా?

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments