వెంకీ మామకు ఉన్న టైమ్ వారం రోజులే

అన్నీ అనుకున్నట్టు జరిగితే వెంకీమామ సినిమా డిసెంబర్ 13న థియేటర్లలోకి వస్తోంది. వెంకటేశ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను ఆరోజు థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. అదే కనుక జరిగితే వెంకీ మామకు బాక్సాఫీస్ వద్ద కేవలం వారం రోజులు మాత్రమే టైమ్ ఉంటుంది.

వెంకీ మామ 13కు వస్తే, అక్కడికి వారం రోజుల గ్యాప్ లో ఒకేసారి సాయితేజ్, బాలయ్య సినిమాలు వస్తున్నాయి. సాయితేజ్ నటిస్తున్న ప్రతి రోజూ పండగే, బాలయ్య చేస్తున్న రూలర్ సినిమాలు డిసెంబర్ 20వ తేదీని ఫిక్స్ చేసుకున్నాయి. సో.. వెంకీమామకు సోలో రన్ 7 రోజులే అన్నమాట.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. వెంకీ మామ డిసెంబర్ 13న రావడం గ్యారెంటీ. విదేశీ పర్యటనకు వెళ్తూ నిర్మాత సురేష్ బాబు ఈ మేరకు నిర్ణయం తీసేసుకున్నారు. ప్రొడక్షన్ యూనిట్ కు సమాచారం అందించారు. ఫారిన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తారు.

డిసెంబర్ 13 మినహా వెంకీమామకు మరో దారి లేదు. ఎందుకంటే 13 కంటే ముందు సినిమా సిద్ధం కాదు. ఆ తర్వాత సినిమా విడుదలకు దారిలేదు. జనవరిలో సంక్రాంతి సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అప్పుడిక ఫిబ్రవరిలో రావాల్సిందే. సో.. డిసెంబర్ 13కు వెంకీ మామ రావడం ఖాయం. నాగచైతన్య, వెంకటేష్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో రాశిఖన్నా, పాయల్ హీరోయిన్లుగా నటించారు. 

Show comments