వెంకీమామ టాకీ పూర్తి

చైతన్య-వెంకటేష్ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా-సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్న సినిమా వెంకీమామ. ఈ సినిమా టాకీ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఒక పాట మినహా మిగిలిన సినిమా అంతా షూట్ ఫినిష్ అయిపోయినట్లు తెలుస్తోంది. షెడ్యూలు ప్రకారం అయితే ఈ సినిమాను దసరా టార్గెట్ గానే వర్క్ చేసారు. కానీ విడుదల ఇప్పుడు ఇంకా డిసైడ్ కావాలి. ప్రస్తుతానికి అయితే డిసెంబర్ ఫస్ట్ వీక్ అన్న టాక్ వుంది.

అయితే సినిమా విడుదల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించే సురేష్ బాబు ఆలోచన పలు విధాలుగా వుందని వినిపిస్తోంది. సినిమాను చకచకా రెడీ చేసి వుంచి, ఎప్పుడు మంచి డేట్ అనుకుంటే అప్పుడు వేయాలని కూడా ఆలోచిస్తున్నారని టాక్ వుంది. రెండువారాల ముందు డిసైడ్ చేసినా, పబ్లిసిటీకి టైమ్ సరిపోతుంది. అందుకే కాపీ మాత్రం రెడీ చేసే పనిలో వుందట యూనిట్.

చైతన్య-వెంకీ మేనమామ - మేనల్లుడుగా నటించే ఈ సినిమా మేనల్లుడి గండం అనే కాన్సెప్ట్ తో రెడీ అవుతున్నట్లు వినికిడి. సినిమా క్లయిమాక్స్ మురారి తరహాలో, పూజలు, శాంతి హోమాలు, మేనల్లుడి గండం నుంచి ఉపశమనం అనే స్టయిల్ లో వుంటుందని తెలుస్తోంది. మురారి చిత్రంలో మహేష్ మాదిరిగానే విక్టరీ వెంకటేష్ మరణం అంచుల వరకు వెళ్లి వెనక్కు వస్తారని వినిపిస్తోంది.

రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమా బాబీ దర్శకుడు.

మారని చంద్రబాబు నాయుడు తీరు

Show comments